ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా జనార్దనస్వామి రథోత్సవం

ABN, First Publish Date - 2023-02-02T01:29:40+05:30

భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం జనార్దనస్వామి రథో త్సవం భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను బాజాభజంత్రీల నడుమ కొండ దిగువకు మధ్యాహ్నం తీసుకువచ్చి రథంపై ఆశీనులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం, ఫిబ్రవరి 1: భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం జనార్దనస్వామి రథో త్సవం భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను బాజాభజంత్రీల నడుమ కొండ దిగువకు మధ్యాహ్నం తీసుకువచ్చి రథంపై ఆశీనులు చేశారు. అనంతరం రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న కుంభాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనవాయితీని అనుసరించి అగ్నికుల క్షత్రియ పెద్దలను రథం వద్ద పూలమాలతో సత్కరించారు. రాజమహేంద్రవరం రూరల్‌ వైసీపీ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, రుడా చైర్‌పర్సన్‌ ఎం.షర్మిలా రెడ్డి ఉత్సవమూర్తులను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వందలాది మంది భక్తులు స్వామి నామస్మరణతో రథాన్ని లాగగా రథం చక్రాలు ముందుకు కదిలాయి. పోలీసు స్టేషన్‌ సెంటర్‌ వరకు రథోత్సవం సాగింది. అనంతరం వెనుదిరిగి ఆలయం వద్దకు చేరుకుంది. అంతకుముందు తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఎస్‌వీఎస్‌ఎన్‌ ఆచార్యులు, పవన్‌ తదిత రుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించి విశేషార్చనలు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తది తరులు కొండపై ఉన్న జనార్దనస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్‌ఎస్‌ పెద్దిరాజు దర్శనం అనంతరం స్వామి వారి ప్రసాదం, శేష వస్త్రాన్ని అందజేశారు. ధవ ళేశ్వరం సీఐ మంగాదేవి పర్యవేక్షణలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ మళ్లిం చారు. అటు రాత్రి కొండపై ప్రత్యేకంగా అలంకరించిన రాజమండపంలో స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ పట్టువస్త్రాలు సమర్పించగా, కల్యాణోత్సవాన్ని భారీగా భక్తులు వీక్షించారు.

Updated Date - 2023-02-02T01:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising