ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గ్రాసిం’ విస్తరణతో నష్టం లేదని నిరూపించగలరా

ABN, First Publish Date - 2023-03-05T00:14:38+05:30

బలభద్రపురంలోని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ వల్ల నష్టం లేదని నిపుణుల కమిటీ ద్వారా నిరూపించగలరా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శనివారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, మార్చి 4: బలభద్రపురంలోని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ వల్ల నష్టం లేదని నిపుణుల కమిటీ ద్వారా నిరూపించగలరా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శనివారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఫిబ్రవరి 28న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ వైసీపీ సమావేశంలా జరిగిందని, అక్కడ వైసీపీ నాయకులు పరిశ్రమ వల్ల కలిగే అనర్థాలను మాట్లాడకుండా పరిశ్రమ వల్ల కలిగే స్వలాభాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారన్నారు. పరిశ్రమ వల్ల తీవ్రంగా నష్టపోయే బలభద్రపురం, బాల వరం, దొంతమూరు. నల్లమిల్లి, సింగంపల్లి గ్రామాల నుంచి ప్రజలను రాకుండా చేశారని, వైసీపీ నాయకులు మాత్రమే హాజరై ఏకపక్షంగా అభిప్రా యాలు తెలియజేశారన్నారు. సైన్స్‌లో పీజీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్య నారాయణరెడ్డికి ఫ్యాక్టరీ వల్ల కలిగే అనర్ధాలు తెలియవని తాను భావించడం లేదని, భవిష్యత్‌లో కలిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని అనుమతులు మం జూరు కాకుండా చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలన్నారు.

Updated Date - 2023-03-05T00:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising