ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2023-01-08T00:41:35+05:30

ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఐదేళ్ల బాలుడు కాకినాడలో శనివారం మృతిచెందాడు. కాకినాడలోని జె.రామారావుపేట ఆకాశపువారి వీధికి చెందిన పెమ్మాడి కార్తీక్‌ (5)కు తల్లిదండ్రులు ధర్మారావు, వెంకటలక్ష్మి ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, జనవరి 7: ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఐదేళ్ల బాలుడు కాకినాడలో శనివారం మృతిచెందాడు. కాకినాడలోని జె.రామారావుపేట ఆకాశపువారి వీధికి చెందిన పెమ్మాడి కార్తీక్‌ (5)కు తల్లిదండ్రులు ధర్మారావు, వెంకటలక్ష్మి ఉన్నారు. వారికి అతడు ఏకైక సంతానం. కాగా ధర్మారావు పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కార్తీక్‌ ప్రతిరోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఆడుకునేందుకు ఇంటి బయటకు వెళ్లాడు. వెంకటలక్ష్మి వంట చేయడం పూర్తయినా తన కొడుకు కనపడకపోయేసరికి తన అత్తగారితో కలిసి స్థానికుల సహాయంతో ఆచూకీ కోసం వెతక సాగింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న చాకలి చెరువు వద్దకు వెళ్లి చూడగా కార్తీక్‌ విగతజీవిగా తేలియాడుతూ కనిపించాడు. ఉదయం ఆడుకుంటూ కనిపించిన తన ఒక్కగానొక్క కొడుకుని విగతజీవిగా చూసి వెంకటలక్ష్మి గుండెలవిసేలా రోధించింది. అనంతరం సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో వి.కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-08T00:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising