ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో మాలమహానాడు నాయకులు

ABN, First Publish Date - 2023-03-31T01:24:01+05:30

మాలమహానాడు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలోని జాతరలో నడిపల్లి రాము అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, జాతీయ అధ్యక్షుడు గొల్ల అరుణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌ తదితరులు రాజమహేంద్రవరం చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మార్చి 30: మాలమహానాడు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలోని జాతరలో నడిపల్లి రాము అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, జాతీయ అధ్యక్షుడు గొల్ల అరుణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌ తదితరులు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఓ హోటల్‌లో బస చేసిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని టూటౌన్‌ స్టేషన్‌కి తరలించారు. అనంతరం మల్లెల వెంకట్రావు, గొల్ల అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని పరార్శించడనాకి వచ్చిన తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తునిలో దాడిశెట్టి రాజా గెలుపునకు దళితులు ఓట్లు భిక్షగా వేస్తే.. ఆయన తన అనుచరులతో రామును కిరాతకంగా హత్య చేయించారని మండిపడ్డారు. జాతరలో రాము కాలు తగిలిందని చంపేయడం ఎంత వరకూ మానవత్వమని ప్రశ్నించారు. రాజా ప్రధాన అనుచరుడు సురేశ్‌, కానిస్టేబుల్‌ మురళీ ఈ హత్యకు కారణమని ఆరోపించారు.

Updated Date - 2023-03-31T01:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising