ధాన్యం కొనకుంటే కలెక్టరేట్‌లో పోస్తాం
ABN, First Publish Date - 2023-05-15T00:11:58+05:30
గొల్లప్రోలు రూరల్, మే 14: రైతుల వద్ద కళ్లాల్లో ఉండిపోయిన ధాన్యాన్ని 48గంటల్లో ప్రభుత్వం కొనకుంటే సదరు ధాన్యాన్ని జిల్లా కలెక్టరు కార్యాలయానికి తీసుకువచ్చి పోస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ హెచ్చరించారు. గొల్లప్రోలు మండలం ఏకే, ఏపీ మల్లవరం గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన కళ్లాల్లో ఉండిపోయిన ధాన్యం రాశులు, బస్తాల ను పరిశీలించి మాట్లాడుతూ ఈక్రాప్ నమో
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
గొల్లప్రోలు రూరల్, మే 14: రైతుల వద్ద కళ్లాల్లో ఉండిపోయిన ధాన్యాన్ని 48గంటల్లో ప్రభుత్వం కొనకుంటే సదరు ధాన్యాన్ని జిల్లా కలెక్టరు కార్యాలయానికి తీసుకువచ్చి పోస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ హెచ్చరించారు. గొల్లప్రోలు మండలం ఏకే, ఏపీ మల్లవరం గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన కళ్లాల్లో ఉండిపోయిన ధాన్యం రాశులు, బస్తాల ను పరిశీలించి మాట్లాడుతూ ఈక్రాప్ నమోదు లో చేసిన తప్పులు ఇప్పుడు రైతులకు శాపంగా మారాయన్నారు. ఈ 2గ్రామాల్లో 15వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వలు రైతులు వద్ద ఉండిపోయాయన్నారు. రైతులు ఆర్బీకేలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కనీస చలనంలేదన్నారు. బొండాలు కొంటామని చెప్పి రైతులను ధాన్యం తీసుకుని రైసుమిల్లులకు వెళ్లాలని చెప్పారని, వారం రోజులుగా ట్రాక్టర్లు మిల్లు ల వద్దే ఉన్నా ఒక్క గింజ కూడా కొనలేదని వర్మ మండిపడ్డారు. ప్రభుత్వమే మిల్లర్లుకు కొమ్ముకాస్తున్నదని, తాము కొనకుండా దళారులకు తక్కు వ ధరకు అమ్ముకునేలా చేస్తున్నదని ఆరోపించారు. తేమశాతం అధికంగా చూపించి బస్తా కు రూ.100కిపైగా కోత విధిస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన బొండాలు ధాన్యాన్ని ప్రభు త్వం కొనకుంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. రైతులు బయట ధాన్యం అమ్ముకుని బస్తాకు రూ.350 నష్టపోతున్నారని తెలిపారు. తాడేపల్లి ప్యాల్‌సలో ఉన్న జగన్‌కు రైతుల కష్టాలు తెలియడం లేదన్నారు. తక్షణం రైతుల కష్టాలను గుర్తించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండ లాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, గనసాల నాగరాజు, కడిమిశెట్టి భాస్కరరెడ్డి, పాలపర్తి వీరయ్య, నక్కా అప్పారావు, ఎలనాటి మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-15T00:11:58+05:30 IST