ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తారా?

ABN, First Publish Date - 2023-07-28T00:17:29+05:30

గొల్లప్రోలు, జూలై 27: ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడంతో అక్కడ గృహాలు నిర్మించుకున్న ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. గొల్లప్రోలు పట్టణ శివారులో సుద్దగడ్డ వరద నీటికి ముంపునకు గురైన జగనన్న కాలనీకి వెళ్లే రహదారిని ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు. జగనన్న కాలనీలో అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలించి కాలనీ

గొల్లప్రోలులో మినరల్‌ వాటర్‌ అందజేసిన వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలులో జగనన్న కాలనీ పరిశీలన

గొల్లప్రోలు, జూలై 27: ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడంతో అక్కడ గృహాలు నిర్మించుకున్న ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. గొల్లప్రోలు పట్టణ శివారులో సుద్దగడ్డ వరద నీటికి ముంపునకు గురైన జగనన్న కాలనీకి వెళ్లే రహదారిని ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు. జగనన్న కాలనీలో అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలించి కాలనీవాసులతో మాట్లాడి మినరల్‌ వాటర్‌ పంపిణీ చేశారు. వర్మ మాట్లాడుతూ కాలనీలో ప్రజలకు తా గునీరు, విద్యుత్‌ సౌకర్యం, పక్కా రహదారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణ ఫేజ్‌-2 కోసం రూ.142కోట్లు తీసుకువచ్చి పనులు ప్రారంభిస్తే అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమకు పనులు అవసరంలేదని నిలిపివేయించారని విమర్శి ంచారు. ఆధునికీకరణ జరిగి ఉంటే ముంపు సమస్య ఉండేది కాదని తెలిపారు. జగనన్న కాలనీకి 29 ఎకరాలు సేకరించారని, అక్కడ ఎకరం ధర రూ.30 లక్షలు ఉంటే 60లక్షలకు కొన్నారని చెప్పారు. ఎకరానికి రూ.30లక్షలు వంతున జగనన్న కాలనీ పేరుతో 9కోట్లు దోచేశారని, ఇందులో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. తక్షణం గొల్లప్రోలు జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, రామిశెట్టి బాబులు, చేదులూరి మాణిక్యం, దువ్వా తాతాజీ, వడ్డి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ముంపు సమస్య పరిష్కారంలో విఫలం

పిఠాపురం, జూలై 27: చిన్నపాటి వర్షానికే పిఠాపురంలో వీధులు, రహదారులు ముంపునకు గురవుతున్నాయని, దీనిని నివారించడంలో ప్రజాప్రతినిధు లు, అధికారులు విఫలమయ్యారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. మన ఇంటికి మన వర్మ ఆశీర్వదిద్దాం, మహాశక్తి కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని 2,3వార్డుల్లో ఆయన పర్యటించారు. తారకరామనగర్‌ తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు సక్రమంగా లేకపోవడం, పూడిక తొలగించకపోవడం వంటి కారణాలతో ఇళ్లలోకి మురుగు, వర్షపునీరు చేరుతున్నదని ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెం భాస్కరరావు, కొరుప్రోలు శ్రీను, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్‌, వార్డు ఇన్‌ చార్జిలు సోము సత్యనారాయణ, సుంకు సుబ్రహ్మణ్య ం, కేశబోయిన సత్యనారాయణ, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్‌, రాయుడు శ్రీను, అయితే రాంబాబు, కోళ్ల బంగారుబాబు, పిల్లి చిన్నా, నల్లా శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-07-28T00:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising