ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఇళ్లస్థలాల్లో అవినీతి

ABN, First Publish Date - 2023-04-03T00:20:29+05:30

పేదల ఇళ్లస్థలాల కోసం చేపట్టిన భూసేకరణ, సైట్‌ఫిల్లింగ్‌ల్లో కోట్లాది రూపాయిల అవినీతి జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పట్టణ శివారులో పేదల కోసం సేకరించిన 55 ఎకరాల భూములను ఆయన ఆదివారం పరిశీలించారు. ఎకరం రూ.22లక్షల ఉన్న భూ మిని రూ.62లక్షలకు కొనుగోలు చేశారని ఇందులో రూ.22 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఇందులో ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాత్ర ఉందని ఆరోపించారు. ఈ భూములు ఇళ్లస్థలాలకు అనుకూలంగా లేవని, వీటిని ఎత్తు చేయా

పిఠాపురం శివారులో భూములు పరిశీలిస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, ఏప్రిల్‌ 2: పేదల ఇళ్లస్థలాల కోసం చేపట్టిన భూసేకరణ, సైట్‌ఫిల్లింగ్‌ల్లో కోట్లాది రూపాయిల అవినీతి జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పట్టణ శివారులో పేదల కోసం సేకరించిన 55 ఎకరాల భూములను ఆయన ఆదివారం పరిశీలించారు. ఎకరం రూ.22లక్షల ఉన్న భూ మిని రూ.62లక్షలకు కొనుగోలు చేశారని ఇందులో రూ.22 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఇందులో ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాత్ర ఉందని ఆరోపించారు. ఈ భూములు ఇళ్లస్థలాలకు అనుకూలంగా లేవని, వీటిని ఎత్తు చేయాల్సి ఉం దని చెప్పారు. పిఠాపురంలో 4వేల మందికి ఇళ్లస్థల పట్టాలు ఇచ్చారని, ఇందులో ఒక్కరికి ఇంకా స్థలాలు అప్పగించలేదన్నారు. వైసీపీ నాయకులు పట్టా కావాలంటే రూ.10నుంచి 20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పేదల ఇళ్లస్థలాల ఎత్తు, సైట్‌ఫిల్లింగ్‌ పేరుతో మట్టి, గ్రావెల్‌ భారీగా తరలించారని ఇందులో రూ.25కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. అసలు ఏయే సైట్లు లెవిల్‌ చేశారు, ఎక్కడ రోడ్లు వేశారో జిల్లా కలెక్టర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులందరికి తక్షణం ఇళ్లస్థలాలు అప్పగించి గృహనిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే లబ్ధిదారులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, నాయకు లు పిల్లి చిన్నా, బర్ల అప్పారావు, అల్లవరపు నగేష్‌, రాయుడు గణేశ్వరరావు, మసకపల్లి రాజా, ఇజ్జన కాసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising