ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిఠాపురంలో తీవ్రంగా తాగునీటి సమస్య

ABN, First Publish Date - 2023-02-16T00:21:45+05:30

పట్టణంలోని పలు ప్రాంతా ల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కుళాయిల ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. ఆయన బుధవారం 15వ వార్డులో పర్యటించి మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చ

15వ వార్డులో పర్యటిస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, ఫిబ్రవరి 15: పట్టణంలోని పలు ప్రాంతా ల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కుళాయిల ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. ఆయన బుధవారం 15వ వార్డులో పర్యటించి మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 15వ వార్డులో తాగునీరు రాక ప్రజలు బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. పురపాలక సంఘం నుంచి ట్యాంకర్లు వస్తున్నా నీరు సరిపోవడం లేదని చెప్పారు. 15,5వార్డులతో పాటు డ్రైవర్స్‌కాలనీల్లో టీడీపీ హాయాంలో తాగునీటి పైప్‌లైను నిమిత్తం రూ.60లక్షలు కేటాయించి టెండర్లు పిలిచామని, ఆ పను లు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, కౌన్సిలరు రాయుడు శ్రీను, నాయకులు పిల్లి చిన్నా, కోళ్ల బంగారుబాబు, పిల్లి చిన్నా, గీసాల రాజు, ఆటో శ్రీను, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-16T00:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising