తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్
ABN, First Publish Date - 2023-05-29T00:31:44+05:30
పిఠాపురం, మే 28: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు నిలిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విగ్రహానికి వ
ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి
పిఠాపురం, మే 28: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు నిలిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విగ్రహానికి వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
కాకినాడ సిటీ: కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దుమ్ములపేట, సంజయ్‌నగర్, భవన్నారాయణ సెంటర్, జె.రామారావుపేట, సంతచెరువు సెంటర్, రామకృష్ణారావుపేట, కామేశ్వరినగర్, పేర్రాజుపేట, ప్రేజర్‌పేటల్లోని ఎన్టీఆర్ విగ్రహాల వద్ద వేడుకలు జరిపారు. పసగడుగుల శేషగిరిరావు, ఎండీ అన్సర్, గుజ్జు లక్ష్మణరావు, మల్లాడి గంగాధరం ఉన్నారు.
Updated Date - 2023-05-29T00:31:44+05:30 IST