ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2023-07-04T00:56:36+05:30

గొల్లప్రోలు రూరల్‌, జూలై 3: గొల్లప్రోలు మండలం తాటిపర్తి కోదండరాముని చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి, గ్రావెల్‌ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులతో కలిసి కాకినాడలో కలెక్టర్‌ కార్యాలయం

జేసీకి వినతిపత్రం అందజేస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు రూరల్‌, జూలై 3: గొల్లప్రోలు మండలం తాటిపర్తి కోదండరాముని చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి, గ్రావెల్‌ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులతో కలిసి కాకినాడలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద సో మవారం ఆందోళన నిర్వహించి జేసీ ఇలక్కియా కు వినతిపత్రం అందజేశారు. తాటిపర్తి చెరువులో జరిపిన అడ్డగోలు తవ్వకాలు, అక్కడ ఏర్పడిన భారీ గోతుల ఫోటోలను జేసీకి అందించి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలను వివరించారు. ఎమ్మెల్యే బినామీలు, అధికారులు కుమ్మక్కై వేయి క్యూ బిక్‌ మీటర్లకు నామమాత్రపు అనుమతి తీసుకుని కోట్లాది రూపాయిల మట్టి, గ్రావెల్‌ను తరలిస్తున్నారని ఆరోపించారు. చేబ్రోలు చెరువులో ఇలా తవ్వకాలు జరగడంతో ఒక వ్యక్తి గోతిలో పడి మరణించాడని తెలిపారు. విచారణ జరిపి మట్టి మాఫియా నుంచి సదరు మొత్తాలను రికవరీ చేయాలని వర్మ డిమాండ్‌ చేశారు. మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, చిట్టూరి సుబ్బారావు, సు బ్బు రామకృష్ణ, జల్లిగంపల రాంబాబు ఉన్నారు.

Updated Date - 2023-07-04T00:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising