ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తేమశాతం పేరుతో అవినీతి

ABN, First Publish Date - 2023-06-26T00:20:43+05:30

యండపల్లిలో ‘పంట మునిగింది- పరిహారం ఇవ్వండి’ యండపల్లి (కొత్తపల్లి), జూన్‌ 25: ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి తేమశాతం పేరుతో ఆర్‌బీకేలు, రైస్‌మిల్లర్లు కోట్లాది రూపాయిల అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. యండపల్లి గ్రామంలో ఆదివారం పంట మునిగింది- పరిహారం ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రైస్‌మిల్లర్ల నుంచి నేరుగా ఎమ్మెల్యేలతో సహా పలువురు అధికారులు,

యండపల్లిలో రైతులతో మాట్లాడుతున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

యండపల్లిలో ‘పంట మునిగింది- పరిహారం ఇవ్వండి’

యండపల్లి (కొత్తపల్లి), జూన్‌ 25: ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి తేమశాతం పేరుతో ఆర్‌బీకేలు, రైస్‌మిల్లర్లు కోట్లాది రూపాయిల అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. యండపల్లి గ్రామంలో ఆదివారం పంట మునిగింది- పరిహారం ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రైస్‌మిల్లర్ల నుంచి నేరుగా ఎమ్మెల్యేలతో సహా పలువురు అధికారులు, మంత్రులు వాటాలుగా పంచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామంలో మునిగిన పంటపొ లాలను నష్టం అంచనా వేసేందుకు ఏఒక్క అధికారి పరిశీలించలేదన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో పంట నష్టపోయిన రైతుల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వర్మ రైతులకు హామీఇచ్చారు. అప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు రైతులకు న్యాయం చేస్తారని తెలిపారు. టీడీపీ హయాంలో స్థాని కంగా మల్టీపర్ప్‌సహాల్‌ కేటాయించామని, ఈ హాల్‌ లో పేదలు వివాహాది శుభకార్యక్రమాలు చేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రస్తుతం వీటిని వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఆర్‌బీకే, పంచాయతీ కార్యాలయాలుగా మార్చేసిందని ఆయన ఆరోపించారు. ఆ కార్యాలయాలను ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. గడపడపకు వచ్చే వైసీపీ ప్రజాప్రతినిధులను సమస్యలపై నిలదీయాలని రైతులు, ప్రజలకు వర్మ విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, రైతులు మత్సా శంకరరావు, స్వామిరెడ్డి గణేష్‌, బండి నాగేంద్ర, ముడదా రవిబాబు, స్వామిరెడ్డి శేషు, తేలు నాగార్జున తదితరులున్నారు.

‘రైతులకు పరిహారం చెల్లించాలి’

కొంగోడు (కరప), జూన్‌ 25: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా డిమాండ్‌ చేశారు. మండలంలో కొంగోడు గ్రామ ంలో రైతులతో కలిసి పంట మునిగింది - పరిహారం ఇవ్వండి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కోల్పోయారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతాంగానికి పరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమైం దని ఆరోపించారు. పరిహారం దక్కని పక్షంలో బాధి త రైతులకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చెల్లిస్తారని బాబా స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడపా వీరభద్రరావు, అనుసూరి గణపతి, గండి సుబ్బారావు, వనుం చంద్రరావు, అప్పారావు, సత్యనారాయణ, రమేష్‌, సత్తిబాబు, ఏడుకొండలు, తలుపులమ్మ తదితర రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising