ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లు పేరుతో ఇబ్బందులు

ABN, First Publish Date - 2023-05-16T23:57:30+05:30

పిఠాపురం, మే 16: ధాన్యం కొనుగోళ్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా సంచులు ఇవ్వకపోవడం, ఇచ్చినా వాహనా లు అందుబాటులో లేకపోవడం, ఆపై తేమ శాత ంలో తేడాలు ఇలా ప్రతి విషయంలోనే రైతాంగం ఇక్కట్లు పడుతున్నదని తెలిపారు. జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బొండాలు రకం ధాన్యం నిల్వలు ఉండగా ఇప్పటివరకూ కేవలం 10శాతం మాత్రమే కొన్నారని, మిగిలిన ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రాఫ్‌ నమోదులో తప్పిదాలతో

పిఠాపురం సమావేశంలో మాట్లాడుతున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, మే 16: ధాన్యం కొనుగోళ్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా సంచులు ఇవ్వకపోవడం, ఇచ్చినా వాహనా లు అందుబాటులో లేకపోవడం, ఆపై తేమ శాత ంలో తేడాలు ఇలా ప్రతి విషయంలోనే రైతాంగం ఇక్కట్లు పడుతున్నదని తెలిపారు. జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బొండాలు రకం ధాన్యం నిల్వలు ఉండగా ఇప్పటివరకూ కేవలం 10శాతం మాత్రమే కొన్నారని, మిగిలిన ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రాఫ్‌ నమోదులో తప్పిదాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లల్లో ఇబ్బందులు పడలేక దళారులు, మిల్లర్లుకు విక్రయిస్తున్నారని, దీని వల్ల బస్తాకు రూ.350 నష్టపోతున్నారని వర్మ చెప్పారు. టీడీపీ ప్రభుత్వహాయాంలో రైతుల వద్ద ధాన్యం వెంటనే కొనేవారమని, వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా బరఖాలు అందించేవారమని గుర్తుచేశారు. రైతులు వద్ద ధాన్యం నిల్వలన్నింటిని ప్రభుత్వమే కొనుగో లు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ పట్టణ, మండలశాఖల అధ్యక్షులు రెడ్డెం భాస్కరరావు, సకుమళ్ల గంగాధర్‌, కొండేపూడి సూర్యప్రకాష్‌, పిల్లి చిన్న, జవ్వాది జోగేశ్వరరావు, దేవరపల్లి రామారావు, నల్లా శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-05-16T23:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising