ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటాల కోసమే వాదనలు

ABN, First Publish Date - 2023-02-27T00:27:09+05:30

పంపకాల్లో తేడాలు రావడం వల్లే వాటాల కోసం అధికార వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు కౌన్సిల్‌ సమావేశంలో బహిరంగంగానే వాదనలకు దిగారని పిఠాపురం మా జీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురం పురపా

సమావేశంలో మాట్లాడుతున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవినీతిలో పిఠాపురం మున్సిపాలిటీ

మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శ

పిఠాపురం, ఫిబ్రవరి 25: పంపకాల్లో తేడాలు రావడం వల్లే వాటాల కోసం అధికార వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు కౌన్సిల్‌ సమావేశంలో బహిరంగంగానే వాదనలకు దిగారని పిఠాపురం మా జీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురం పురపాలకసంఘం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందనే దానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడుతూ మున్సిపాలిటీలో జ రుగుతున్న వ్యవహారాలు చూసి ఆసహ్యం వేస్తున్నదన్నారు. సుమారు రూ.30లక్షలకు పైగా విలువ చేసే తుక్కు ఇనుమును అధికారులు, వైసీపీ కౌన్సిలర్లు కలి సి రూ.1.28లక్షలకే అమ్మివేశారని.. ఇందులో జరిగిన అవినీతిలో అందరికి వాటా ఉందని, వాటాలు తేలకపోవడంతో కౌన్సిల్‌ సమావేశంలోనే నిస్సుగ్గుగా రౌడీ లు మాదిరిగా వాదనలు పడ్డారని ఆయన విమర్శించారు. పారదర్శకంగా టెండర్లు పిలిచి వేలం వేయా ల్సి ఉండగా ఆ విధంగా చేయకుండా చేయడం దారుణమన్నారు. టీడీపీ కౌన్సిలర్లు ప్రజాసమస్యల కోసం అడుగుతుంటే వైసీపీ కౌన్సిలర్లు మాత్రం మా పంపకాల్లో తేడాలు తేల్చాలని పట్టుపట్టడం ఆసహ్యంగా ఉందన్నారు. సాక్షాత్తు మున్సిపల్‌ డీఈఈయే రూ.65 వేలు ఇచ్చాను, అవి సరిపోవా, నోరు విప్పి అందరు జాతకాలు బయటపెట్టమంటారా అంటూ మాట్లాడ టం, దానికి వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకపోవడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మన్సిపా లిటీ ఇలా తయారవ్వడానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబే కారణమని మండిపడ్డారు. పురపాలకసంఘం లో అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనేనని, తా ము తీసుకొచ్చిన నిధులతోనే పనులు జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిందని శూన్యమని, భారీగా అవినీతి మాత్రం జరుగుతుందన్నారు.

టౌన్‌ప్లానింగ్‌లో భారీ అవినీతి

పిఠాపురం మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో నూ భారీ అవినీతి జరుగుతుందని వర్మ ఆరోపించా రు. పేదల గృహాలు నిర్మించుకుంటుంటే మున్సిపల్‌ సిబ్బంది వెళ్లి నిర్మాణాలు ఆపివేస్తామని బెదిరించ డం, ఒక్కొక్క ఇంటి వద్ద రూ.2లక్షలకు పైగా వసూ లు చేసి టీపీవో, కమిషనరు, కౌన్సిలర్లు కలిసి పంచుకుంటున్నారని ఆరోపించారు. పట్టణంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. టిడ్కో గృహాలు పూర్తయి 3సంవత్సరాలు 10 నెలలు గడిచినా నేటికి లబ్ధిదారులకు అప్పగించలేదని, రుణాలు తీసుకున్న లబ్ధిదారులు నెలానెల ఈఎంఐలు కడుతున్నారని, వీటిని లబ్ధిదారులకు అప్పగించేందుకు వైసీపీ నేతలు వసూళ్లపర్వానికి తెరలేపారని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, జిల్లా కార్వనిర్వాహక కార్యదర్శి కొండేపూడి ప్రకాష్‌, కౌన్సిల ర్లు అల్లవరపు నగేష్‌, కోళ్ల బంగారుబాబు, నల్లా రవణమ్మ, పంపనబోయిన అన్నపూర్ణ, రాయుడు శ్రీను, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-27T00:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising