ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దళితుల పథకాలను రద్దు చేసిన వైసీపీ

ABN, First Publish Date - 2023-08-12T23:52:01+05:30

పిఠాపురం, ఆగస్టు 12: దళితుల సంక్షేమానికి సంబంధించిన 28 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ ఎన్‌ వర్మ విమర్శించారు. వారి సంక్షేమానికి వినియోగించాల్సిన ఎస్సీ కార్పోరేషన్‌ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి దళితులకు ద్రోహం చేశారని ఆరోపించారు. పిఠాపురం 19,16వార్డుల్లో మన ఇంటికి మన వర్మ, మహాశక్తి కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. టీడీపీ హాయాం

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, ఆగస్టు 12: దళితుల సంక్షేమానికి సంబంధించిన 28 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ ఎన్‌ వర్మ విమర్శించారు. వారి సంక్షేమానికి వినియోగించాల్సిన ఎస్సీ కార్పోరేషన్‌ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి దళితులకు ద్రోహం చేశారని ఆరోపించారు. పిఠాపురం 19,16వార్డుల్లో మన ఇంటికి మన వర్మ, మహాశక్తి కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. టీడీపీ హాయాం లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, మహాశక్తి పథకాలపై వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. పట్టణంలో కోట్లాది రూపాయిలతో పార్కులను అభివృద్ధి చేస్తే నేటి పాలకుల నిర్లక్ష్యంతో అవి నిరుపయోగంగా మారాయన్నారు. పార్కులన్నీ కుక్కలు, పందులు, పశువులకు నెలవుగా ఉన్నాయని చెప్పారు. రథాలపేట అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టామని వర్మ తెలిపారు. వార్డుల్లో శానిటేషన్‌ అధ్వానంగా ఉంద ని, నెలల తరబడి డ్రెయిన్లల్లో పూడికలు తీయ డం లేదన్నారు. దుర్గంధపూరిత వాతావరణంలోనే ప్రజలు జీవనం సాగిస్తుండటం వల్ల అంటువ్యాధుల బారిన పడే ప్రమాదముందన్నా రు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్నివర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. అంతకుముందు దళితుల సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ రద్దు చేయడంపై అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వర్మ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. టీడీపీ నాయకులు యాళ్ల గణేష్‌, నూతాటి ప్రకాష్‌, దుర్గాడ విజయలక్ష్మి, రాయి గంగాధర్‌, లొండా ఆనంద్‌, కూసి సత్తిబాబు, చిల్లి ఆర్యనందన్‌, సింగలూరి సతీష్‌ ఉన్నారు.

Updated Date - 2023-08-12T23:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising