ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజల కోసం ఏమి చేశారో చెప్పి తిరగాలి

ABN, First Publish Date - 2023-08-02T23:59:05+05:30

పిఠాపురం, ఆగస్టు 2: వార్డుల్లో ప్రజల కోసం ఏమి చేశారో చెప్పి అప్పుడు ఎమ్మెల్యే గడపగడపకు తిరగాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఎమ్మెల్యేకు సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. మన ఇంటి మన వర్మ, మహాశక్తి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో బుధవారం ఆయన పర్యటించారు. వార్డుల్లో అధ్వాన పారిశుధ్యం, మురికికూపాలుగా

పిఠాపురంలో ప్రచారం చేస్తున్న వర్మ

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, ఆగస్టు 2: వార్డుల్లో ప్రజల కోసం ఏమి చేశారో చెప్పి అప్పుడు ఎమ్మెల్యే గడపగడపకు తిరగాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఎమ్మెల్యేకు సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. మన ఇంటి మన వర్మ, మహాశక్తి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో బుధవారం ఆయన పర్యటించారు. వార్డుల్లో అధ్వాన పారిశుధ్యం, మురికికూపాలుగా ఉన్న వీధులతో పాటు ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, వీటిని వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇందిరానగర్‌, మాధవనగర్‌ను కలిపే రోడ్డును పూర్తిగా మూసివేసి పబ్లిక్‌మరుగుదొడ్డి, కాలువ స్థలాన్ని అధికార పార్టీ నేతలు కబ్జా చేసి విక్రయించేశారని, దీనిని ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వర్మ ఆరోపించారు. అంత కు ముందు డ్రైవర్స్‌ కాలనీలో పర్యటించారు. కార్యక్రమాల్లో టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెం భాస్కరరావు, కొరుప్రోలు శ్రీను, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్‌, మోర్త పండు, పెదపాటి బాల, పిల్లి చిన్నా, నల్లా శ్రీను, అల్లవరపు నగేష్‌, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-02T23:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising