విజిలెన్స్ విచారణ జరిపించాలి
ABN, First Publish Date - 2023-02-28T01:07:55+05:30
పిఠాపురం పురపాలకసంఘంలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ ఆధ్వర్యంలో సోమవారం ము న్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అవినీతిలో వాటాల కోసం అధికారులు, వైసీపీ కౌన్సిలర్లు వాదులాడుకోవడం సిగ్గు చేటంటూ ని నాదాలు చేశారు. వర్మ మాట్లాడుతూ పిఠాపురం మున్సిపాలిటీలో తుక్కు,ఇ
పిఠాపురంలో టీడీపీ నాయకుల ధర్నా
పిఠాపురం, ఫిబ్రవరి 27: పిఠాపురం పురపాలకసంఘంలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ ఆధ్వర్యంలో సోమవారం ము న్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అవినీతిలో వాటాల కోసం అధికారులు, వైసీపీ కౌన్సిలర్లు వాదులాడుకోవడం సిగ్గు చేటంటూ ని నాదాలు చేశారు. వర్మ మాట్లాడుతూ పిఠాపురం మున్సిపాలిటీలో తుక్కు,ఇనుము విక్రయాల్లో రూ.28లక్షల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ నిధుల్లో వాటాలు పంచుకోవడం లో తేడాలు రావడంతో కౌన్సిలర్లు, అధికారులు రోడ్డునపడ్డారన్నారు. ఇతర అభివృద్ధి పనులు, బాస్కెట్‌బాల్ కోర్టు పనుల్లో లక్షలు అవినీతి జరిగిందని వర్మ ఆరోపించారు. జనన, మరణ దృవీకరణపత్రాలు జారీ, భవన నిర్మాణాలకు అనుమతి విషయంలో డబ్బులు ఇవ్వందే పనులు జరగడంలేదని విమర్శించారు. ఈ వ్యవహారాలు అన్నింటిలో ఎమ్మెల్యే, కౌన్సిలర్లు, అధికారులకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఒక్క బాస్కెట్‌బాల్ కోర్టుల పనుల విషయంలోనే ఒక వ్యక్తికి రూ.65వేలు ఇచ్చామని చెప్పిన డీఈఈపై మొ త్తం విషయాలు బయటపెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యవహారాలు అన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనరు ఎం.రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, పంపనబోయిన అన్నపూర్ణ, కో ళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను పాల్గొన్నారు.
Updated Date - 2023-02-28T01:07:55+05:30 IST