ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసేవకే జీవితం అంకితం

ABN, First Publish Date - 2023-05-16T00:16:46+05:30

పిఠాపురం, మే 15: ప్రజలకు సేవలందించేందుకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ

పిఠాపురంలో వర్మకు కేక్‌ తినిపిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, మే 15: ప్రజలకు సేవలందించేందుకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ప్రకటించారు. పట్టణంలోని టీడీపీ పాత కార్యాలయ ప్రాంగణంలో వర్మ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధి క సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరి మధ్య వర్మ కేక్‌ను కట్‌ చేశారు. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంతో పాటు వారికి అన్నివేళలా అండగా నిలుస్తున్నానని తెలిపారు. ఎక్కడ ఎవ్వరికి ఏ ఇబ్బంది, కష్టం ఉన్న తాను తక్షణం వెళ్లి వారికి సంఘీభావం తెలపడంతో పాటు వారి కష్టాలు, సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పాటును అందిస్తున్నానని వివరించారు.

చంద్రబాబు, లోకేశ్‌ శుభాకాంక్షలు

వర్మ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.

గొల్లప్రోలులో వేడుకలు

గొల్లప్రోలు, మే 15: పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, నగరపంచాయతీ మాజీ చైర్మన్‌ శీరం మాణిక్యం, పడాల ఏసువెంకటరమణ, దువ్వా తాతాజీ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-16T00:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising