ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకనూ భర్తీ కాని 81 పీజీటీ పోస్టులు..

ABN, First Publish Date - 2023-05-26T00:19:42+05:30

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత ఏడాది మండలానికి ఒక మహిళా జూనియర్‌ కళాశాలల చొప్పున 46 ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్‌ ప్లస్‌ పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. అయితే వీటిలో పీజీటీలను నియమించకుండా ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతోను, పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా బోధన జరిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిక్కవోలు, మే 25: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత ఏడాది మండలానికి ఒక మహిళా జూనియర్‌ కళాశాలల చొప్పున 46 ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్‌ ప్లస్‌ పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. అయితే వీటిలో పీజీటీలను నియమించకుండా ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతోను, పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా బోధన జరిపించారు. దీంతో ఉత్తీర్ణతా శాతం బాగా తగ్గడంతో ఈ ఏడాది ప్రభుత్వం ముందుగా ఈ ప్లస్‌ పాఠశాలల్లో అర్హత ఉన్న వారిని నియమించేందుకు అంగీకార పత్రాలు తీసుకుంది. దీంతో 324 మంది పీజీటీలను నియమించేందుకు ఈనెల 20, 24 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఇంకనూ 81 పోస్టుల్లో చేరేందుకు ముందుకు రాలేదు. బోటనీలో 16, కెమిస్ట్రీలో 19, సివిక్స్‌ 3, కామర్స్‌ 1, ఎకనామిక్స్‌ 1, ఇంగ్లిష్‌ 2, మేథ్స్‌ 4, ఫిజిక్స్‌ 19, తెలుగు 4, జువాలజీ 12 పీజీటీ పోస్టులు భర్తీ కాలేదు. ఈ పోస్టులు భర్తీ అయ్యే వరకూ ఉన్నతాధికారుల అనుమతులతో మరలా కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-05-26T00:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising