ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్ దారుణం : రాజప్ప
ABN, First Publish Date - 2023-06-07T00:27:36+05:30
సామర్లకోట, జూన్ 6: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అక్ర మ అరెస్ట్ దారుణమని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం రాత్రి సామర్లకోట మండలం అచ్చంపేటలోని ఎమ్మెల్యే చినరాజప్ప స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌ను అడ్డుకుం
సామర్లకోట, జూన్ 6: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అక్ర మ అరెస్ట్ దారుణమని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం రాత్రి సామర్లకోట మండలం అచ్చంపేటలోని ఎమ్మెల్యే చినరాజప్ప స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటే ఎమ్మెల్యే నిమ్మలను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ధన దాహానికి అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభు త్వ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ అరె్‌స్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని లేకుంటే పార్టీ పరంగా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని చినరాజప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Updated Date - 2023-06-07T00:27:36+05:30 IST