ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంచ్‌.. కొడుతున్నారు..

ABN, First Publish Date - 2023-07-24T01:28:07+05:30

జీవితంలో చదువు, మార్కులు, ర్యాంకులే కాదు, క్రీడలు కూడా అవసరమని గుర్తించారు. ఆత్మరక్షణ కోసం బాక్సింగ్‌ నేర్చుకోవాలన్న తపనకు తల్లి వెన్నుతట్టి ప్రోత్సహించడంతో కిక్‌ బాక్సింగ్‌పై ఆశక్తి పెంచుకున్నారు.

విశాఖలో జరిగిన కిక్‌ బాక్సింగ్‌లో ప్రథమస్థానంతో టైటిల్‌ బెల్ట్‌ సాధించిన చేపల శ్రీను

పంచ్‌లతో..పతకాలు కొల్లగొడుతున్న అన్నాచెల్లెలు

వైజాగ్‌లో జరిగిన కిక్‌ బాక్సింగ్‌ రాష్ట్ర చాంపియన్‌గా శ్రీను

మహిళా విభాగంలో బెస్ట్‌ కిక్‌ బాక్సర్‌గా లావణ్య

సర్పవరం జంక్షన్‌, జూలై 23: జీవితంలో చదువు, మార్కులు, ర్యాంకులే కాదు, క్రీడలు కూడా అవసరమని గుర్తించారు. ఆత్మరక్షణ కోసం బాక్సింగ్‌ నేర్చుకోవాలన్న తపనకు తల్లి వెన్నుతట్టి ప్రోత్సహించడంతో కిక్‌ బాక్సింగ్‌పై ఆశక్తి పెంచుకున్నారు. వీరి శ్రమ,పట్టుదలకు తోడు కోచ్‌ తర్పీదున్వివడంతో కఠోర సాధనతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పతకాలు సొంతం చేసుకున్నారు. వారే కాకినాడ రూరల్‌ మండలం తూరంగికి చెందిన అన్నా చెల్లెలు చేపల శ్రీను, చేపల లావణ్యలు. తొలుత అన్నయ్య శ్రీను బాక్సింగ్‌ నేర్చుకోగా, చెల్లెలు కూడా ఈ క్రీడ పట్ల ఆసక్తి పెంచుకుని రాణిస్తోంది. అనతికాలంలోనే వివిధ వేదికల్లో జరిగిన పోటీల్లో ప్రత్యర్థులపై పంచ్‌లు కురిపిస్తూ పతకాలు కొల్లగొడుతూ కిక్‌ బాక్సింగ్‌లో చాంపియన్లుగా రాణిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో శ్రీను ప్రథమస్థానం సాధించి టైటిల్‌ బెల్ట్‌ సాధించి చాంపియన్‌ సొంతం చేసుకున్నాడు. మహిళా విభాగంలో బెస్ట్‌ కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ని సొంతం చేసుకుంది. వీరిద్దరిపై ప్రత్యేక కథనం.

పంచ్‌లతో...పతకాలు సొంతం

కాకినాడ రూరల్‌ మండలం తూరంగి శివారు అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన చేపల శ్రీను ఆదిత్య కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం, సోదరి లావణ్య జగన్నాథపురం ఏఎస్‌డీ ఉమెన్స్‌ కాలేజీలో బీకాం కంప్యూటర్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అనతి కాలంలోనే బాక్సింగ్‌లో ప్రత్యర్థులపై పంచులతో విరుచుకుపడుతూ రాణించడాన్ని చూసిన కోచ్‌ శ్రీనివాస్‌, మండల, జిల్లా పోటీలకు తీసుకెళ్లడంతో రాష్ట్ర, జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో రాణిస్తూ పలు పతకాలు సొంతం చేసుకున్నాడు. అలాగే అన్నయ్య బాక్సింగ్‌ను పరిశీలించి చెల్లెలు లావణ్య కూడా దీనిపై ఆశక్తి కనబరచడంతో తల్లి అంగీకరించి ప్రోత్సహించడంతో మహిళా విభాగంలో పలు పోటీల్లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌తోపాటూ పలు అవార్డులు సాధించింది. తండ్రి చిన్న మృతి చెందడంతో తల్లి వ్యాపారం చేస్తూ ఇద్దరు కుమారులు, కుమార్తెను చదివిస్తూ ప్రోతహిస్తోంది.

శ్రీను సాధించిన పతకాలు

ఫ జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలో నవంబరు, 22లో నిర్వహించిన కిక్‌ బాక్సింగ్‌ ఇంటర్నేషనల్‌ పోటీలో కొద్దిపాటి పంచుల తేడాతో గోల్డ్‌ మెడల్‌ చేజారగా, సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు.

ఫజమ్మూ, కాశ్శీర్‌లో 7, మే, 2023లో నిర్వహించిన వరల్డ్‌ మిక్స్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు.

ఫ రాజోలులో 30, మే 2023న నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ మినీ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు.

విశాఖ ఆర్కేబీచ్‌లో 23-24, జూన్‌ 2023లో జరిగిన కిక్‌ బాక్సింగ్‌ స్టేట్‌ ప్రో చాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రథమ స్థానంతో చాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు.

చేపల లావణ్య సాధించిన పతకాలు:

ఫఉత్తరప్రదేశ్‌లో 20, మే 2023లో నిర్వహించిన బాక్సింగ్‌ పోటీలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ తరపున పాల్గొని మెరుగైన ప్రదర్శనతో ఉత్తమ ప్లేయర్‌గా రాణించింది.

ఫ రాజోలులో 30, మే 2023న నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ మినీ ఒలింపిక్స్‌లో మహిళా విభాగంలో పాల్గొని సిల్వర్‌ ప్లేయర్‌గా రాణించింది.

ఫ విశాఖ ఆర్కేబీచ్‌లో 23-24 జూన్‌ 2023లో నిర్వహించిన కిక్‌ బాక్సింగ్‌ పోటీలో పాల్గొని ఉత్తమ కిక్‌ బాక్సర్‌ అవార్డు అందుకుంది.

అంతర్జాతీయ బాక్సర్లుగా రాణించాలనేది కోరిక

ఫ చేపల శ్రీను, లావణ్య

ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న కిక్‌ బాక్సింగ్‌ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఖ్యాతి గడించడమే ధ్యేయంగా కష్టపడుతున్నాం. తల్లి సావిత్రి సంపూర్ణ సహకారంతో కోచ్‌ శ్రీనివాస్‌ తర్పీదులో బాక్సింగ్‌లో రాణిస్తున్నాం. చదువులో రాణిస్తూ బాక్సింగ్‌ క్రీడలో అంతర్జాతీయ క్రీడాకారులుగా దేశానికి ప్రాతినిద్యం వహించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నాం.

Updated Date - 2023-07-24T01:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising