చెయ్యేరు పంచాయతీకి రివార్డ్
ABN, First Publish Date - 2023-05-14T01:01:56+05:30
చెయ్యేరు గ్రామ పంచాయతీకి ఆర్థిక పురస్కారం లభించింది.
కాట్రేనికోన, మే 13: చెయ్యేరు గ్రామ పంచాయతీకి ఆర్థిక పురస్కారం లభించింది. అభివృద్ధి, ఆర్థిక ప్రణాళికల్లో జిల్లాలోనే చెయ్యేరు పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచినట్టు సర్పంచ్ చెల్లి సురేష్ తెలిపారు. రివార్డుగా రూ.50వేలు పంచాయతీ ఖాతాలో ప్రభుత్వం జమ చేసినట్టు కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. సర్పంచ్ సురేష్, సభ్యులు ప్రణాళికాబద్ధంగా గ్రామాభివృద్ధికి కృషిచేసినందునే రివార్డు లభించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు నడింపల్లి సుబ్బ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, మాజీ జడ్పీటీసీలు నాగిడి నాగేశ్వరరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, నాయకులు సూదా నాగభూషణం, వెంట్రు సుధీర్, వాసంశెట్టి రాజేశ్వరరావులు సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు.
Updated Date - 2023-05-14T01:01:56+05:30 IST