ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యోగం సరే.. జీతమేది!

ABN, First Publish Date - 2023-06-26T00:52:55+05:30

అందరూ 55 ఏళ్లు పైబడిన వారే.. ప్రభుత్వ ఉద్యో గం అంటే ఎగిరిగంతేశారు.. అవకాశం వచ్చింది కదా అని అందరూ జాయి నైపోయారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

58 రోజులుగా అందని వేతనాలు

అయోమయంలో డీఎస్సీ ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు

కోరుకొండ, జూన్‌ 25: అందరూ 55 ఏళ్లు పైబడిన వారే.. ప్రభుత్వ ఉద్యో గం అంటే ఎగిరిగంతేశారు.. అవకాశం వచ్చింది కదా అని అందరూ జాయి నైపోయారు.. అయితే వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా ఒక్కటే.. జీతాలు ఎప్పుడు సక్రమంగా ఇచ్చింది కనుక.. 1998 డీఎస్సీ ఉపాధ్యాయులకు అంతే పరిస్థితి. మొదటి నెల నుంచే పెండింగ్‌.. గత విద్యా సంవత్సరం ముగిసినా నేటికీ జీతాలు పడలేదు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన వేతనం నేటికీ అందక పోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 280 మంది 1998 డీఎస్సీ ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 25 ఏళ్ల పాటు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు న్యాయస్థానాల్లో సుదీర్ఘపోరాటం చేసిన వీరిని ప్రస్తుత ప్రభుత్వం గత ఏప్రిల్‌ 12వ తేదీన విధుల్లోకి తీసుకుంది. వీరి నివాస స్థానం నుంచి 200 కిలోమీటర్లు దూరం వరకు విస్తరించి ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో నియమించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో 50 ఏళ్లు పైబడిన వయ సులో విలీన మండలాల్లోని గ్రామాల్లోకి కూడా చాలా మంది వెళ్లి విధుల్లో చేరారు. అయితే వీరందరిని ఏప్రిల్‌ 30న విధుల నుంచి తొలగించారు. ఇప్పటికీ 58 రోజులు అవుతున్నా వీరు పని చేసిన కాలానికి వేతనం ఇవ్వలేదు. జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ తిరిగి వీరిని విధుల్లోకి తీసుకోలేదు. 98 డీఎస్సీ ఎంటీఎస్‌ ఉపాధ్యాయులకు 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Updated Date - 2023-06-26T00:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising