ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నారు ముదిరిపోతోంది!

ABN, First Publish Date - 2023-08-02T01:38:22+05:30

కాలం కలిసి వ చ్చినా కరువు తీరాలేదన్నట్టు మన మెట్ట రైతాంగం పరిస్థితి ఉంది. ఓపక్క వరుణుడు కరుణిస్తున్నా అవస రమైన మేర సాగునీరు లేకపోవడంతో వరి నాట్లు వేసే పరిస్థితి కనిపించ డం లేదు.

నారుపోసి నెల రోజులు కావొస్తున్న వరి నాడుమడులు

పూర్తి స్థాయిలో సాగునీరందక ముందుకు సాగని సాగు

జగ్గంపేట రూరల్‌, ఆగస్టు1: కాలం కలిసి వ చ్చినా కరువు తీరాలేదన్నట్టు మన మెట్ట రైతాంగం పరిస్థితి ఉంది. ఓపక్క వరుణుడు కరుణిస్తున్నా అవస రమైన మేర సాగునీరు లేకపోవడంతో వరి నాట్లు వేసే పరిస్థితి కనిపించ డం లేదు. మళ్లీ భారీ వర్షాలు వస్తేనే వరినాట్లు పడతాయన్నట్టు పరిస్థితి ఉంది. దీంతో వరినారు పోసి నెల రోజులు కావొస్తున్నా పూర్తిస్థాయిలో నీరు లేకపోవడం వల్ల వరి నారుమడుల్లోనే దర్శనమిస్తోంది. వాస్తవానికి 25 రోజు లు దాటితే నారు ముదురుతోంది. దీనివల్ల రైతుకు దిగుబడి తగ్గిపోతుంది. ఓ వైపు వరి నారుమడుల్లో నీరు లేక, మరోవైపు ముదురుతున్న నారును చూసి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వరి రైతులు ఉన్నారు. పుష్కర తెచ్చాం.. మెట్ట రైతుకు భరోసానిచ్చామనే పాలకుల మాటలు అవి ఎప్పుడో నిజంకాదని తేలిపోయింది. ప్రభుత్వం గతంలో పుష్కర టెండర్లలో పనులు చేపట్టిన కాం ట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరుచేయకపోవడంతో పుష్కర వైపు కన్నెత్తి చూసే కాంట్రాక్టర్లు కరువయ్యారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పుష్కరపై శ్రద్ధ కనబరచకపోవడంతో వరుణుడిపైనే రైతులు ఆధారపడుతు న్నారు. గత ఏడేళ్లుగా పుష్కరకు సంబంధించి కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపోవడం పాలకులకు పుష్కరపై ఉన్న శ్రద్ధకు అద్దంపడుతోంది. ఇక అధికారుల తీరు కూడా పుష్కరకు శాపంగా మారిందనే చెప్పాలి. గత సంవ త్సరం వరిచేలు చివరి దశకు వచ్చేసరికి నీటి ఎద్దడి చాలా ఇబ్బంది తెచ్చింది. రైతులు పుష్కర కోసం ఎదురుచూసినా, అధికారులకు మొర పెట్టుకున్నా నీరు రాలేదు. అయితే వరుణుడు కరుణించి వర్షం కురవడంతో వరి రైతు ఊపిరి పీల్చుకోగలిగారు. గత సంవత్సరం ఇంత ఇబ్బందిని రైతులు ఎదుర్కొన్నప్పటికీ కనీసం ఈసారైనా ముందస్తు ప్రణాళిక అధికారులకు లేకపోవడం దారుణం. ఇకనైనా ముందస్తు ప్రణాళికతో సాగునీరు అందివ్వాలని రైతులు కోరారు.

Updated Date - 2023-08-02T01:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising