కిటకిటలాడిన కోరుకొండ
ABN, First Publish Date - 2023-03-05T01:12:25+05:30
కోరుకొండ శ్రీ లక్ష్మినరసిం హస్వామి దివ్య కల్యాణ మహోత్స వాలు రెండో రోజు శనివారం వైభవంగా సాగాయి. ఉదయం స్వామి వారికి ప్రత్యేక ఆరాధన, అనంతరం భక్తు లకు సర్వదర్శనం, తదుపరి గ్రామ బలిహరణ, 9 గంటలకు సేవాకాలం,తీర్థ ప్రసాద గోష్టి, సర్వదర్శనం, రాత్రి గ్రామ బలిహరణ నిర్వహించారు.
కోరుకొండ, మార్చి4: కోరుకొండ శ్రీ లక్ష్మినరసిం హస్వామి దివ్య కల్యాణ మహోత్స వాలు రెండో రోజు శనివారం వైభవంగా సాగాయి. ఉదయం స్వామి వారికి ప్రత్యేక ఆరాధన, అనంతరం భక్తు లకు సర్వదర్శనం, తదుపరి గ్రామ బలిహరణ, 9 గంటలకు సేవాకాలం,తీర్థ ప్రసాద గోష్టి, సర్వదర్శనం, రాత్రి గ్రామ బలిహరణ నిర్వహించారు. కొండ దిగువన ప్రతిష్ఠించబడిన లక్ష్మినరసింహ స్వామి.. కొండపైన స్వయంభూగా వెలిసిన లక్ష్మినరసింహ స్వామి,కొండ మధ్య గల శ్రీ భూ సమేత అనంత పద్మనాభ స్వామి శ్రీ రంగరాజ స్వామి వార్లను భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్శించుకున్నారు. మూడో రోజు భక్తజనం పోటెత్తారు. కొండ భక్తులతో కిటకిటలాడింది.అన్నవరం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి పాదాల వద్ద పానకాలు పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.దిగువ దేవస్థానం ధ్వజస్థంభం వద్ద నూనె, నెయ్యి దీపాలతో వెలిగిం చారు. కొండపొడవునా మెట్లకు ఇరువైపులా దీపాలు వెలిగించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారి కళావేదికపై రాజమహేంద్రవరానికి చెందిన ప్రసాద్ నృత్య కళానికేతన్ విద్యార్థులు భరతనాట్యప్రదర్శన ఆకట్టుకుంది.
Updated Date - 2023-03-05T01:12:25+05:30 IST