ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మోదీ తొమ్మిదేళ్ల పాలనపై మేథావుల సభ

ABN, First Publish Date - 2023-06-26T00:05:41+05:30

ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రధానరంగాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బీజేపీ జిల్లాశాఖ అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు అధ్యక్షతన అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మేథావుల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురంటౌన్‌, జూన్‌ 25: ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రధానరంగాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బీజేపీ జిల్లాశాఖ అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు అధ్యక్షతన అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మేథావుల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివ రించారు. డాక్టర్‌ అయ్యగారి వెంకటేశ్వరరావు ఇందిరా గాం ధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను తెలి పారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయాలని డాక్టర్‌ ఈఆర్‌ సుబ్ర హ్మణ్యం డిమాండ్‌ చేశారు. పలు అంశాలపై కిసాన్‌ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఉప్పుగంటి భాస్కర రావు, అడబాల సత్యనారాయణ, మోకా వెంకట సుబ్బా రావు, డాక్టర్‌ పెయ్యల శ్యామ్‌ప్రసాద్‌, పాలూరి సత్యా నందం, ఆర్వీ నాయుడు, యర్రమల్లి పాండు రంగారావు, దూరి రాజేష్‌, కొండేటి ఈశ్వర్‌గౌడ్‌ మాట్లాడారు.

బీజేపీ శ్రేణుల ప్రచారం

అంతర్వేది, జూన్‌ 25: కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని, పంచాయతీ స్థాయిలో కూడా నిధులను దిగమింగుతున్నారని రాష్ట్ర బీజేపీ కోఆపరేటివ్‌ సెల్‌ డైరెక్టర్‌ మాలే శ్రీనివాస నగేష్‌ ఆరోపించారు. ఆదివారం సఖినేటి పల్లిలంకలో మోదీ తొమ్మిదేళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను బీజేపీ శ్రేణు లు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు చెంపాటి శివరామకృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పట్టపు సూర్యప్రకాశరావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు తిరుమల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పోతురాజు సురేష్‌, కార్యదర్శి గుండుబోగుల వీరవెంకటసత్యనారాయణ, బూత్‌ కమిటీ అధ్యక్షులు పడాల శ్రీను, కొనగాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising