ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చల్లంగ.. చూడమ్మా..

ABN, First Publish Date - 2023-07-05T00:56:25+05:30

తెలంగాణ బతుకమ్మ.. ఆంధ్రకు వచ్చింది.. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో సందడి చేసింది.. ఆషాఢమాసం మోదకొండమ్మ బోనాల మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

బోనాలతో మహిళల ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోరుకొండ, జూలై 4 : తెలంగాణ బతుకమ్మ.. ఆంధ్రకు వచ్చింది.. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో సందడి చేసింది.. ఆషాఢమాసం మోదకొండమ్మ బోనాల మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారి ఆలయం నుంచి సుమారు 1000 మందికి పైగా మహిళలు బోనాలు తలపై పెట్టుకుని గ్రామమంతా ఊరేగారు. చల్లంగ చూడమ్మా అంటూ కొలిచారు. ఆషాఢమాసంలో బోనాల ఉత్స వం తెలంగాణలో నిర్వహిస్తారు. అదే సంస్కృతిని గత 23 ఏళ్లుగా శ్రీరంగపట్నం గ్రామంలో నిర్వహించడం ఆచారం.ఈ బోనాలు ఉత్సవానికి శ్రీరంగపట్నం ఆడపడుచులు ప్రపంచంలో ఎక్కడ ఉన్న గ్రామానికి చేరుకుని బోనాలు ఎత్తుకుంటారు. బోనాలు ఎత్తుకుంటే సంతోషంగా ఉంటామని ఆడపడుచుల నమ్మకం. సుమారు 3వేల మంది వరకు మహిళలు ఈ బోనాలు ఉత్సవంలో పాల్గొనడంతో శ్రీరంగపట్నం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పలువురు ప్రముఖులు బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు.

Updated Date - 2023-07-05T00:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising