కొండెక్కిన కోడ్
ABN, First Publish Date - 2023-02-24T00:48:34+05:30
ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఏ ప్రభుత్వమూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. ఇలా చేస్తే ఓటర్లు ప్రభావితమవుతారనే కారణంతో అభివృద్ధి పను లకు అడ్డుకట్ట వేస్తారు. ఏ ఎన్నికలు జరిగే సమయంలోనైనా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.
ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన
శివరాత్రికి దేవస్థాన కమిటీల నియామకం
దేవాలయాల వద్ద ఫెక్సీలు
మోరంపూడి ఫ్లయ్ ఓవర్‌కు ఎంపీ శంకుస్థాపన
గోదావరి నీరంటూ ఎమ్మెల్యే రాజా ప్రచారం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఏ ప్రభుత్వమూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. ఇలా చేస్తే ఓటర్లు ప్రభావితమవుతారనే కారణంతో అభివృద్ధి పను లకు అడ్డుకట్ట వేస్తారు. ఏ ఎన్నికలు జరిగే సమయంలోనైనా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్నందున ఈ నెల 9వ తేదీ నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి అధికార పార్టీగానీ, ప్రతిపక్షంగానీ కోడ్ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారు. కాని జిల్లాలో అధికార వైసీపీ ప్రభుత్వానికి, దాని ప్రతినిధులకు ఈ కోడ్ వర్తించనటట్టు ఉంది. అసలు ఎన్నికల కమిషనంటే భయమూ లేదు. కనీసం ప్రజాస్వామ్యం మనుడగ కోసం కోడ్‌ను పరిరక్షించాలనే ఆలో చనే లేదు. మొదట ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలు, వాటి ప్రతినిధులు ఎన్నికల సమయంలో అనేక పథ కాలు తెచ్చి ప్రజల మీద రుద్దేస్తుంటే అంతేకాక, ఇంతకుముందు పట్టించుకోని పనులను చేపడుతుంటారు. వాటికి విస్త్రతమైన ప్రచారమూ ఇస్తుంటారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత విశ్వేశ్వరస్వామి ఆలయం, ఉమారామలింగేశ్వరస్వామి దేవస్థానం, సారంగధర దేవస్థానం, కోటిలింగేశ్వరస్వామి, మార్కండేయ స్వామి, బసవలింగేశ్వరస్వామి దేవస్థానం కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో చైర్మన్‌తో పాటు మొత్తం 9 మంది ఉండేటట్టు చేశారు. వీటిని అధికారికంగా ప్రకటించకుండా ఆయా దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేర ఉత్సవ కమిటీలను ప్రతిపాదించినట్టు పం పారు. ఈ నియామకాలను ఎవరు ప్రతిపాదించారనేది లేదు. శివరాత్రి సందర్భంగా ఆయా దేవాలయాల వద్ద కమిటీ చైర్మన్లు, ఎంపీ ఫొటోలతో ఫెక్సీలు వెలిశాయి. వీటిపై ఇంత వరకూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏ విధమైన చర్యతీసుకోలేదు.ఇక మోరంపూడి ఫ్లయ్ ఓవర్ పనులు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అక్కడ కొన్ని ప్రాఽథమిక పనులు చేసి, డ్రెయిన్లు తవ్వుతున్నారు. ఫ్లయ్ ఓవర్ స్తంభాల నిర్మాణానికి రెండు రోజుల కిం దట ఎంపీ మార్గాని భరత్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు ఇవ్వడం కోసం జలజీవన్ మిషన్ పథకం నుంచి నిధులు మంజూరు చేయడానికి సీఎం జగన్ వద్ద అనుమతి పొంది, విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి రాజానగరం నియోజకవర్గంలో అనే గ్రామాలకు గోదావరి నీళ్లు లేవు. ఇంకా ట్యాంకర్లు ద్వారా తెచ్చుకోవడంతో పాటు, ఎక్కువ గ్రామాలు బోర్ల నీటినే వినియోగిస్తున్నారు. వాస్తవానికి ఈ జలజీవన్ మిషన్ వాటర్‌గ్రిడ్ పేరుతో గత ప్రభుత్వ హయాంలో మంజూరైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులు చేశారు. కానీ నిధులు లేవు. దీంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఎన్నికల సందర్భంగా ఇది మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఇలా జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. రాజమహేంద్రవరంలో ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలన్నీ తొలగించిన అధికారులు సీఎం,ఎంపీ, మిఽథున్‌రెడ్డి, బోస్ వంటి నేతలతో ఉన్న ఫ్లెక్సీల జోలికి వెళ్లడంలేదు. ఇటువంటి వ్యవహారాల వల్ల ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోతోంది.
Updated Date - 2023-02-24T00:48:36+05:30 IST