ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసీదు స్థలంలో అక్రమ నిర్మాణంపై ముస్లింల ఆందోళన

ABN, First Publish Date - 2023-04-03T01:28:26+05:30

మండపేట కలవపువ్వు సెంటర్‌లో వున్న జమియామసీదుకు చెందిన స్థలంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయం వివాదాస్పదంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత

సమస్య పరిష్కరించుకోవాలని సూచించిన కొత్తపేట ఇన్‌చార్జి. డీఎస్పీ వెంకటరమణ

మండపేట, ఏప్రిల్‌ 2. మండపేట కలవపువ్వు సెంటర్‌లో వున్న జమియామసీదుకు చెందిన స్థలంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయం వివాదాస్పదంగా మారింది. వక్ఫ్‌బోర్డుకు చెందిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ ముస్లింలు ఆదివారం ఆందోళకు దిగిన నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసు కుంది. అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణం పనులు నిలుపుదల చేయాలని ముస్లింలు ఆందోళన చేపట్టారు. దుకాణ నిర్మాణదారులు మాత్రం తామెవరి స్థలంను ఆక్రమించలేదని తమవద్ద స్థలానికి సంబంధించిన పత్రాలు ఆధారాలు ఉన్నాయని, తాము 30 ఏళ్ల నుంచి తమ ఆధీనంలో స్థలం ఉందని అందువల్లనే నిర్మాణపనులు చేపట్టామని సమాధానం చెప్పారు. ఇదే నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? అధికా రులు ఎమైనా నోటీసులు ఇచ్చారా? అన్న ప్రశ్నలకు నిర్మాణదారులు తమకు అధికారులు నోటీసులు ఇచ్చారని సమాధానం ఇచ్చారన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత గ్రౌండ్‌ప్లోరు నిర్మాణ పనులు మాత్రం చేస్తూ పైఅంతస్తు పనులు వదిలేశామంటూ పొంతనలేని సమాధానాలు చెప్పటం గమనార్హం. మసీదుని చేర్చి నిర్మిస్తున్న షాపింగ్‌కాంప్లెక్స్‌ విషయంలో ముస్లింలకు నిర్మాణదారుడుకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల నడుమ కలవపువ్వుసెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపు సెంటరులో వాహనాలు నిలుపుదలచేసి ముస్లింలు ఆందోళకు దిగటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి. ఓ దశలో ఆందోళన చేస్తున్న ముస్లింలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు కొత్తపేట ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఇరువర్గాలతో చర్చలు జరిపి ట్రాఫిక్‌ను నియంత్రించారు. తాము ప్రభుత్వానికి, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కనీసం నిర్మాణ పనులు నిలుపు దలకు చర్యలు తీసుకోలేదని ముస్లింలు డీఎస్పీ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే తమవద్ద ఆధారాలు ఉన్నాయంటూ షాపింగ్‌ నిర్మాణదారులు జొన్నలశ్రీనివాస్‌. కన్నబాబులు చెప్పటంలో డీఎస్పీ వెంక టరమణ ముస్లింలకు 28రోజులపాటు గడువు ఇచ్చి సర్వే చేయించుకోవా లని ముస్లింలకు, మసీదు కమిటీకి సూచించారు. అలాగే సర్వే పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని డీఎస్పీ నిర్మాణదారులకు సూచించారు. దాంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం తాత్కాలికంగా తెరపడింది. కార్యక్రమానికి మసీదు కమిటీ అల్తాప్‌, ఖరీం, సల్మాన్‌ హుస్సేన్‌, సయ్యద్‌ మైనర్‌బాబు, పలువురు ముస్లింలతో పాటు మండపే ట పట్టణ ఎస్‌ఐ కోనా అప్పారావు, పట్టణ పోలీసులు ఉన్నారు.

Updated Date - 2023-04-03T01:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising