ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మణిపూర్‌ మహిళలకు రక్షణ కల్పించాలి

ABN, First Publish Date - 2023-08-22T01:10:26+05:30

మణిపూర్‌ మహిళలకు రక్షణ కల్పించాలంటూ వీఆర్‌పురం పాస్టన్ల కమిటీ సభ్యులు మండల సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. వీఆర్‌పురం నుంచి రేఖపల్లి వరకు మణిపూర్‌ మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ జరిగింది.

వరరామచంద్రాపురం. అగస్టు 21: మణిపూర్‌ మహిళలకు రక్షణ కల్పించాలంటూ వీఆర్‌పురం పాస్టన్ల కమిటీ సభ్యులు మండల సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. వీఆర్‌పురం నుంచి రేఖపల్లి వరకు మణిపూర్‌ మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక వాతావరణాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని మహిళలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. అనంతరం జడ్పీటీసీ సభ్యుడు వాళ్ళ రంగారెడ్డి మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలియనట్టుగా వ్యవహరిస్తున్నాయని మణిపూర్‌ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ కొండల్లో ఉన్న ఖనిజ సంపద కోసం గొడవలు సృష్టిస్తున్నారని, ఈగొడవల్లో ఎంతోమంది మహిళలు చిత్రహింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, పాస్టర్లు గాబ్రియల్‌, డేవిడ్‌ లివింగ్‌స్టన్‌, గాబ్రియల్‌, ప్రేమ్‌సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising