ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలో కుప్పం

ABN, First Publish Date - 2023-01-27T01:10:11+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం నుంచి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

లోకేశ్‌ను కలిసిన జ్యోతుల నవీన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం నుంచి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభంకానున్న యాత్రకు జిల్లా నుంచి పెద్దఎత్తున నేతలు గురు వారం బయలుదేరి వెళ్లారు. జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లా స్థాయి నేతలు తమ కేడర్‌తో అక్కడకు పయనమయ్యారు. మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మె ల్యే రాజప్ప బుధవారం తిరుపతికి చేరుకున్నారు. అక్కడ లోకేశ్‌ను కలిసి ఆయనతోపాటు కుప్పం వెళ్లారు. గురువారం సాయంత్రం పిఠాపురం, కాకి నాడ మాజీ ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు తదితరులు రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా కుప్పానికి వెళ్లనున్నారు. జగ్గంపేట నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల రాజా తదితరులు గురువారం కుప్పం వెళ్లి లోకేశ్‌ను కలిశారు. మరోపక్క జిల్లాలో తెలుగు యువత విభాగం నేతలు సైతం బస్సుల్లో పెద్దఎత్తున అక్కడకు వెళ్లారు. వీరంతా శుక్రవారం లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఉదయం సరి గ్గా 11.03 గంటలకు లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. అదే సమయంలో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు లోకేశ్‌తో పాటు కొంతసేపు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదిలాఉంటే 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగే లోకేశ్‌ పాదయాత్ర దిగ్విజయం కావాలంటూ గురు వారం జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, తెలుగు యువత నాయకులు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఆలయాలు, మసీదు లకు వెళ్లి ప్రార్థనలు చేశారు. మరోపక్క శుక్రవారం కుప్పంలో పాదయాత్ర మొదలైన సమయంలోనే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ పాదయాత్ర చేయడానికి భారీ ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-01-27T01:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising