సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి గురజాడ’
ABN, First Publish Date - 2023-09-22T00:13:49+05:30
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి గురజాడ అప్పారావు అని సాహీతీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జ్యోశ్యుల కృష్ణబాబు అన్నారు.
పెద్దాపురం, సెప్టెంబరు 21 : తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి గురజాడ అప్పారావు అని సాహీతీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జ్యోశ్యుల కృష్ణబాబు అన్నారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గురజాడ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. అనంతరం కృష్ణబాబు మాట్లాడుతూ సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అని అన్నారు. ఈకార్యక్రమానికి ముం దుగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో రొంగల అరుణ్, నేహాలక్ష్మీ, గౌన్, నియాజ్, నిఖిల, రొంగల వీర్రాజు, దారపురెడ్డి కృష్ణ, సిరిపురపు బంగ్రాజు పాల్గొన్నారు.
పిఠాపురం: పిఠాపురం పట్టణంలోని ఏకేపీఎం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేవీవీ గౌరవాధ్యక్షుడు వి.సత్యనారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ విశ్రాంత డీడీ అప్పారావు, గంగబాబు, ఎన్.సూర్యనారాయణ, హెచ్‌ఎం సలీనా సపర్ణ పాల్గొన్నారు.
గొల్లప్రోలు: గొల్లప్రోలు పట్టణంలోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో మహాకవి గురజాడ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జేవీవీ గౌరవాధ్యక్షుడు దాడి పద్మనాభం, అధ్యక్షుడు ఏలేటి నానిబాబు, హెచ్‌ఎం సీహెచ్.సూర్యప్రకాశరెడ్డి, సమతా జిల్లా కన్వీనర్ చల్లా ఉమారాజ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
సామర్లకోట: గురజాడ అడుగు జాడలు అందరికీ ఆదర్శం, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు కృషిచేసిన సంఘ సంస్కర్త శేఖర గురజాడ అప్పారావు అడుగు జాడల్లో సామా జిక చైతన్యం కోరే ప్రతీ ఒక్కరూ నడవాలని ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. గురువారం స్థానిక అయోద్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల సమక్షంలో గురజాడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు పండిట్ బీ. శ్రీలక్ష్మి గురజాడ రచనలు కన్యాశుల్కం, కన్యక తదితర అంశాలను వివరించారు.
ల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:13:49+05:30 IST