నిధుల జాప్యం.. కదలని పాఠశాల నిర్మాణం
ABN, First Publish Date - 2023-03-14T01:39:39+05:30
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా నాడు-నేడు కార్యక్రమాన్ని రూపొందించామని ప్రభుత్వం ఊదరగొడుతోంది. అయితే రెండవ దశలో భాగంగా కొన్నిచోట్ల నిధుల జాప్యంతో పాఠశాల భవనాలు, ఇతర పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం లంకలగన్నవరం శివారు గూటంవారిపేట మండల ప్రజాపరిష త్ ప్రాఽథమిక పాఠశాల పరిస్థితి కూ
నడిగాడిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థులకు కొనసాగుతున్న బోధన
పి.గన్నవరం, మార్చి 13: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా నాడు-నేడు కార్యక్రమాన్ని రూపొందించామని ప్రభుత్వం ఊదరగొడుతోంది. అయితే రెండవ దశలో భాగంగా కొన్నిచోట్ల నిధుల జాప్యంతో పాఠశాల భవనాలు, ఇతర పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం లంకలగన్నవరం శివారు గూటంవారిపేట మండల ప్రజాపరిష త్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి కూడా ఇదే. పాఠశాల భవనం శిథిలం కావడంతో నాడు-నేడులో నూతన పాఠశాలకు పనులు చేపట్టారు. నిర్మాణం ప్రారంభించి ఆరు నెలలు కావస్తున్నా పాఠశాల ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానికంగా ఉన్న అంబేడ్కర్ కమ్యూనిటీ హాలు వద్ద విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ పాఠశాల నిర్మాణానికి రూ.53 లక్షలు మంజూరయ్యాయి. గతేడాది వరదల కారణంగా ఆలస్యంగా అక్టో బర్ నెలలో పాఠశాల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటివరకు మొదటి విడతగా సుమారు రూ.8 లక్షలు వరకు నిధులు మంజూరుకావడంతో పునాదుల వరకు పూర్తయ్యింది. ప్రస్తుతానికి నిధులు మంజూరులో జాప్యంకావడంతో పాఠశాల నిర్మాణం ముందుకు సాగడంలేదు. దీంతో పరాయిపంచన పాఠాలు నిర్వహించడానికి ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, 54 మంది విద్యార్థులు ఉండే ఈ పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - 2023-03-14T01:39:39+05:30 IST