ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సత్రం భూముల వేలానికి అడ్డగోలు షరతులు

ABN, First Publish Date - 2023-06-26T00:22:39+05:30

ఆరు దశాబ్ధాల నుంచి లేని నిబంధనలు పేదల పోరాటంతో బహిరంగ వేలంపాట పెట్టే పరిస్థితికి ప్రస్తుతం రావడంతో లేని పోని అడ్డుగోలు షరతులు విధిస్తూ పేదలను వేలంపాటకు రాకుండా అడ్డు కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పేదలు వేలానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు

  • రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల

గోకవరం, జూన్‌ 25: ఆరు దశాబ్ధాల నుంచి లేని నిబంధనలు పేదల పోరాటంతో బహిరంగ వేలంపాట పెట్టే పరిస్థితికి ప్రస్తుతం రావడంతో లేని పోని అడ్డుగోలు షరతులు విధిస్తూ పేదలను వేలంపాటకు రాకుండా అడ్డు కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు విమర్శించారు. మండలంలోని రంపయర్రంపాలెంలో సుందరమ్మ సత్రం భూముల వేలం నిర్వహణలో దేవ దాయ ధర్మదాయశాఖ అధికారుల నిర్ణయాలు పేదలకు వ్యతిరేకంగా ఉన్నా యంటూ గ్రామంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వీరాంజనేయులు మాట్లాడుతూ గత భూస్వాములు ఎకరాకు రూ.వెయ్యి చెల్లించి అక్రమంగా ఫలసాయాన్ని పొందే వారన్నారు. కానీ ఈనెల 27న నిర్వహించే వేలానికి ఎకరాకు రూ.10 వేలు చొప్పున దరావత్తు ఖరారు చేయడం, పాట పూర్తయిన వెంటనే ఒక సంవత్స రం శిస్తు తక్షణం చెల్లించాలంటూ నిబంధనలు పెట్టడం చూస్తుంటే జరగబో యేది భూస్వాములకు అనుకూలమైన వేలంగానే కనిపిస్తోందని ఆవేదన చెం దారు. కావున సంబంధిత అధికారులు స్పందించి పేదలకు అందు బాటులో ఉండేవిధంగా బహిరంగ వేలం నిర్వహించాలని ఆయన డిమాండు చేశారు. కార్యక్రమంలో వి.రాజబాబు, బి.రమేష్‌, డి.సురేష్‌, గోలి ముసలయ్య, కడవల వెంకటరమణ, కడవల అప్పారావు, అన్నిబోయిన కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising