ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పట్టాలు ఇచ్చారు..స్థలాలు ఎక్కడ?

ABN, First Publish Date - 2023-09-20T00:24:27+05:30

గొల్లప్రోలు రూరల్‌, సెప్టెంబరు 19: ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇంతవరకూ తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని పలువురు మహిళలు ప్రశ్నించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి సచివాలయం-2 పరిధిలో మంగళవారం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు

ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళలు

గొల్లప్రోలు రూరల్‌, సెప్టెంబరు 19: ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇంతవరకూ తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని పలువురు మహిళలు ప్రశ్నించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి సచివాలయం-2 పరిధిలో మంగళవారం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. స్థలాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మహిళలు డిమాండ్‌ చేశారు. దొరబాబు మాట్లాడుతూ కోర్టులో ఉండటంతో స్థలాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. కొత్తపేటలో గృహాల మీదుగా కరెంటు వైర్లు వెళ్లుతున్నాయని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. కాగా అపర్ణాదేవి కోనేరు వద్ద ప్రహారీగోడ నిర్మాణంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

Updated Date - 2023-09-20T00:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising