నాలుగు నెలల విరామం తర్వాత.. ఎట్టకేలకు
ABN, First Publish Date - 2023-10-26T01:45:43+05:30
గోదావరి వరదల కారణంగా గత నాలుగు నెలల నుంచి నిలిచిపోయిన కోటిపల్లి-ముక్తేశ్వరం రేవు మధ్య నిలిచిపోయిన రాకపోకలు ఎట్టకేలకు నెలాఖరుకు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.
కోటిపల్లి -ముక్తేశ్వరం రేవులో వారం రోజుల్లో రాకపోకలు..
ముక్తేశ్వరం వైపు రాకపోకలకు రహదారి సిద్ధం
మండపేట, అక్టోబరు25: గోదావరి వరదల కారణంగా గత నాలుగు నెలల నుంచి నిలిచిపోయిన కోటిపల్లి-ముక్తేశ్వరం రేవు మధ్య నిలిచిపోయిన రాకపోకలు ఎట్టకేలకు నెలాఖరుకు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న రేవులో వరదల నేపఽథ్యంలో ముక్తేశ్వరం రేవు వైపు రాకపోకలు సాగించే రోడ్డు పాడవడం, గోదావరి వరదకి కొట్టుకుపోయి పలుచోట్ల రోడ్డుకు గండ్లు పడడంతో వాటికి ప్రస్తుతం మరమ్మతు పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. ప్రధానంగా ముక్తేశ్వరం వైపు రేవు వైపు కిలోమీటరు మేర రోడ్డు దెబ్బ తింది. అలాగే గోదావరిలో కూడా 450 మీటర్ల మేర రహదారి దెబ్బతింది. రెండు రోడ్లు కలిపి మొత్తం 1.5 కిలోమీటర్ల మేర పనులు ఈనెలాఖరకు పూర్తి చేయడం జరుగుతుందని రేవు నిర్వాహకులు చెప్పారు. నాలుగు నెలల నుంచి రేవులో రాక పోకలునిలిచిపోవడంతో కోనసీమ నుంచి ఇటు కోటిపల్లి రేవుదాటి కాకినాడ, రామ చంద్రపురంనకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇక నిత్యం జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లాలంటే అటు రామచంద్రపురం, ఇటు మండపేట నియోజకవ ర్గానికి చెందిన ప్రజలు రేవు దాటి అమలాపురం వెళ్లాల్సి ఉంది. అలాగే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ, కోటిపల్లి నుంచి ఐనవిల్లి వినాయకుడు ఆలయానికి వెళ్లే భక్తులు కూడా రేవులో రాకపోకలు నిలిచిపోవడంతో అటు రావులపాలెం నుంచి ఐనవిల్లి వెళ్లాల్సివస్తోంది. రేవు మూతపడడంతో అదనపు దూరం తిరిగి అమలా పురం వెళ్లిరావాల్సి వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలల తర్వాత ముక్తేశ్వరం వైపు రేవులో పాడైన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో ఈనెలాఖరు నాటికి రాకపోకలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రేవు నిర్వాహకులు చెప్పారు. ఆయా ప్రాంతాలకు అనువైన రోడ్డు ఏర్పడడంతోపాటు కార్తీకమాసం నేపఽథ్యంలో మార్గం సుగమం కానుంది.
Updated Date - 2023-10-26T01:45:43+05:30 IST