2 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు
ABN, First Publish Date - 2023-02-16T00:12:41+05:30
కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి దివ్య కల్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్రవంజిత్ అధికారులకు సూచించారు. కోరుకొండలో బుధవారం ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్షించారు. మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు.
కోరుకొండ, ఫిబ్రవరి 15 : కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి దివ్య కల్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్రవంజిత్ అధికారులకు సూచించారు. కోరుకొండలో బుధవారం ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్షించారు. మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. కోరు కొండ అన్నవరం దత్తత ఆలయం అయినందున అన్నవరం దేవస్థానం చైర్మన్, ధర్మకర్తల మండలి అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం ఆర్డీవో చైత్ర వర్షిణి మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. వివిధ ప్రభు త్వ శాఖల అధికారులకు శాఖల వారీగా ఉత్సవాల నిర్వహణ బాధ్యత అప్పగించారు. అనంతరం కల్యాణోత్సవానికి సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించా రు. ఇటీవల అన్నవరం దేవస్థానం ఽధర్మకర్తల మండలి సభ్యురాలుగా నియమితురాలైన తాడి రజనీ హరిశ్చంద్రప్రసాద్ రెడ్డిని శాలువాతో సత్క రించారు. సమావేశంలో అన్నవరం దేవస్థానం ఈవో ఎన్‌వీఎస్ .మూర్తి, ఏసీ డీఎల్‌వీ రమేష్‌బాబు, డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో నరేష్ కుమార్, తహశీల్దార్ పాపారావు, అన్నవరం ఈఈ నూకరత్నం, కోరుకొండ ఆలయ చైర్మన్ ఎస్‌వీ రంగరాజ భట్టర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-16T00:12:43+05:30 IST