ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కో..ఢీ

ABN, First Publish Date - 2023-01-15T00:28:32+05:30

ఆపేదెవడు.. అడ్డుకునేదెవడు.. అంతా మా ఇష్టం.. కోడి పందేల్లోనూ అదే జరిగింది.. గత నెల రోజులుగా కోడి పందేలు జరగనివ్వమని ప్రతినబూ నిన ఖాకీలు తొలిరోజే చేతులెత్తేశారు..

కోట్లాట : దేవరపల్లిలో బరి వద్ద గుమిగూడినజనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యథేచ్ఛగా కోడి పందేలు

గ్రామాల వారీగా బరులు

బరుల వద్ద షాపులకు వేలం

జిల్లాకు జూదగాళ్ల క్యూ

ఏరులై పారిన మద్యం, సారా

చేతులెత్తేసిన పోలీసులు

చేతులు మారిన కోట్లు

తొలిరోజు రూ.10 కోట్లు

గుండాట, పేకాటకు ఓకే

కానరాని యాక్షన్‌ టీమ్‌లు

ఆపేదెవడు.. అడ్డుకునేదెవడు.. అంతా మా ఇష్టం.. కోడి పందేల్లోనూ అదే జరిగింది.. గత నెల రోజులుగా కోడి పందేలు జరగనివ్వమని ప్రతినబూ నిన ఖాకీలు తొలిరోజే చేతులెత్తేశారు.. షరా మూ మూలుగా వైసీపీ నాయకులు చెప్పినదానికి తలూ పారు..లాఠీలను పట్టుకుని కోడి పందేల వద్ద కాపలా కాశారు.. రాష్ర్టానికి శాంతి భద్రతలపై దిశా నిర్దేశం చేసే హోం మంత్రి వనిత క్యాంపు కార్యాల యానికి కూతవేటు దూరంలోనే పందేలు జరగడం వైసీపీ నాయకుల బరి తెగింపునకు అద్దం పట్టింది. కోడి పందేలకు ఓకే కానీ.. గుండాట, పేకాట నిర్వహించమని ప్రతిన బూనినా అదీ జరగలేదు.. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఎదుటే గుండాట, పేకాట నిర్వహించడం గమనార్హం. గోపాల పురం మండలం వేళ్లచింతలగూడెంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి గుండాట, పేకాట సాగుతూనే ఉన్నా యి. తొలిరోజు జిల్లాలో సుమారు రూ. 10 కోట్ల వరకూ చేతులు మారినట్టు సమాచారం.

(రాజమహేంద్రవరం,-ఆంధ్రజ్యోతి /నల్లజర్ల/ కొవ్వూరు) : నిన్నటి వరకు కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన చేసిన ఖాకీల ముందు రాజకీయ కోడి గెలిచింది.సంక్రాంతి పండుగలో ఎట్టి పరిస్దితిలో కోడి పందేలు జరగడం ఖాయమని తేలింది.ఖద్దర్‌ ముందు ఖాకీ ఎప్పుడు ఓడిపోవడం పరిపాటిగా వస్తోంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్ళు సై అంటే సై అన్నారు.సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామంటూ ప్రచారం హోరెత్తించిన అధికారులు పరోక్ష అనుమతులను మంజూరు చేస్తూ ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో అదికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పందేల రాయుళ్లు రెచ్చిపోయారు.. గ్రామాల్లో పంట పొలాలను, లేఅవుట్లను, ఖాళీస్థలాలను ట్రాక్టర్లతో దున్ని మరి బరులు తయారుచేశారు. షామియానాలు వేసి పుంజులకు కత్తులు కట్టి బరిలో వదిలారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత సొంత జిల్లా అయినా జూదం పడగ విప్పింది. గుండాట, పేకాట ఆడితే అరెస్ట్‌ చేస్తామని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సిహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. ఎక్కడి కక్కడ యథేచ్ఛగా సాగాయి.కోడిపందేలకు మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి.. అనుమతి ఇప్పించినప్పటికీ గుండా టకు అనుమతి తేలేకపో యారు.ఎలాగైనా అనుమతులు వస్తాయని ఆశిం చిన పందేల నిర్వాహకులు బోర్టులు తెచ్చి ఉం చారు.కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నమే గుండాట, పేకాట ఆడగా..హోం మంత్రి వనిత సొంత నియో జకవర్గం కొవ్వూరులో మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత గుండాట, పేకాట ఆడించారు. గుం డాట పేకాట లేకపోతే ప్రజాప్రతి నిధులు, రెవెన్యూ, పోలీసులకు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామని.. పలు గ్రామాల్లోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకు న్నట్టు సమాచారం. రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని కాతేరు నుంచి కొంతమూరు వెళ్లే దారిలోని తోటల్లో పెద్ద ఎత్తున టెం టులు వేసి, కోడిపందేలతో పాటు గుండాట నిర్వహించడం గమనార్హం.హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో ని చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు మండల్లో కోడిపందేలు జోరందుకున్నాయి. హోం మంత్రి వనిత క్యాంపు కార్యాల యా నికి కూతవేటు దూరంలోనే పందేలు సాగడం గమనార్హం. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి. కోడి పందేల వద్దకు యు వత ఎక్కువగా తరలిరావడం గమనార్హం. అన్ని మండలాల్లోని సుమారు ఒక వంతు గ్రామాల్లో కోడిపందేలు మొదలయ్యాయి.తాళ్లపూడి మండలంలోని వైసీపీ, టీడీపీ నాయకులు ముందస్తు ఒప్పందం మేరకు మూడేసి బరులు వేసినట్టు చెబుతున్నారు. పోలీసులు, అధికారులు వారం రోజుల నుంచి కోడి పందాలు ఆడనిచ్చేది లేదని విస్తృతంగా ప్రచారంచేశారు.వందలాది మందికినోటీసులు కూడా ఇచ్చా రు. కానీ కోడిపందేలు ఆగలేదు. బరులు వద్ద మ ద్యం, సారా ఏరులైపారింది.భోగిరోజు మఽధ్యా హ్నం నుంచి కోడి పందాలు మొదలయ్యాయి.ఇక కను మ వరకూ ఇష్టానుసారం రెచ్చిపోతారు. సాధారణంగా భోగి రోజు తక్కువ పందేలు ఉంటాయి. కానీ ఈసారి భోగిరోజు కూడా ఎక్కువయ్యాయి. తొలిరోజు రూ. 10 కోట్ల వరకూ చేతులు మారినట్టు సమాచారం.ఒక్క నల్లజర్ల మండలంలోనే సుమారు రూ.కోటి వరకూ పందేలు సాగినట్టు సమాచారం.

హోం మంత్రి ఇలాకాలో..

కొవ్వూరులోని హోం మంత్రి వనిత క్యాంపు కార్యాల యానికి కూతవేటు దూరంలోనే కోడి పందేలు సాగాయి. అయినా ఆపేవారు లేరు. మండలంలోని తోగుమ్మి, ఐ.పంగిడి, సీతంపేట, కుమారదేవం, కొవ్వూరు పట్టణంలోని నందమూరు రోడ్‌, హోలి ఏంజిల్స్‌ పాఠశాల రోడ్‌లో కోడి పందాలు యథేచ్ఛగా జరిగాయి. బరులు వద్ద జూదగాళ్ల కోసం మందు, విందుకు సంబంధించి షాపుల ఏర్పాటుకు పందేల నిర్వాహకులు వేలం పాట నిర్వహించినట్టు సమాచారం. భోగి పండగ రోజైన శనివారం మధ్యాహ్నం 1-30 గంటల వరకు పందేలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అనంతరం ఒక్క కోడి పందేలు మాత్రమే నిర్వహించుకునేందుకు చూసీచూడనట్టుగా వదిలేశారు.గుండాట, పేకాటలకు అనుమతి లేకుం డా.. కోడి పందేలకు మాత్రమే అనుమతిస్తే నిర్వాహకులకు మిగిలేదేముంటుందని పలువురు నాయకులు హోం మంత్రి వనితకు తెలిపినట్టు సమాచారం. 6 నుంచి 9 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఇటువంటి సమయంలో నాయకులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే, రానున్న ఎన్నికల్లో నాయకులు ఏ విధంగా సహకరిస్తారని అధికార పార్టీ నాయకులు మంత్రి వనితకు తెలి యజేసినట్టు తెలిసింది. దీంతో శనివారం సాయంత్రం నుంచి గుండాట,పేకాటను చూసీచూడనట్టు వదిలేశారు. కలెక్టర్‌ వేసిన జాయింట్‌ యాక్షన్‌ టీములు, కాగితాలకే పరిమితమయ్యాయని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుండాట,పేకాట ఆడేశారు..

కోడిపందాలకు, గుండాటలకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు వాదించినా వైసీపీ నేతలు సాధించారు. భోగిరోజు నుంచే కోడిపందేలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం వరకు గుండాటలకు గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. దీంతో వెర్రెక్కిపోయిన వైసీపీ నేతలు గ్రామ స్థాయి నుంచి తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. గుండాటకు అనుమతిలేకపోతే ఎలా అని వాపోయారు. చివరకు ఏమైందో కానీ జిల్లాలో చాలా చోట్ల సాయంత్రానికి గుండాటలు మొదలయ్యాయి. రాజానగరం నియోజవర్గంతో పాటు అనపర్తికొవ్వూరు, తదితర నియోజకవర్గాల్లో కూడా గుండాట, పేకాట ప్రారంభమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట గుండాటలకు ఒత్తిడి కనిపించలేదు.

Updated Date - 2023-01-15T00:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising