ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కళాకారులను ఆదరించాలి’

ABN, First Publish Date - 2023-03-26T23:53:53+05:30

కళాకారులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పి.సత్యం అన్నారు. మిర్యాలగూడ సాంస్కృతిక కళాశాలలో ఈనెల 10 నుంచి 20వరకు నిర్వహించిన జాతీయ స్థాయి నాటిక పోటీల్లో కాకినాడకు చెందిన శ్రీసీతారామంజనేయులు నాట్యమండలి సభ్యులు ప్రదర్శించిన నర్తనశాల పద్యనాటకానికి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి వచ్చిన సందర్భాన్ని పురస్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సర్పవరం జంక్షన్‌, మార్చి 26: కళాకారులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పి.సత్యం అన్నారు. మిర్యాలగూడ సాంస్కృతిక కళాశాలలో ఈనెల 10 నుంచి 20వరకు నిర్వహించిన జాతీయ స్థాయి నాటిక పోటీల్లో కాకినాడకు చెందిన శ్రీసీతారామంజనేయులు నాట్యమండలి సభ్యులు ప్రదర్శించిన నర్తనశాల పద్యనాటకానికి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏపీఎస్పీ రామాలయం లో అభినందన సభ నిర్వహించారు. సత్యం మాట్లాడుతూ రిటైర్డు ఏపీఎస్పీ సిబ్బంది కలసి నాట్యమండలి ఏర్పాటు చేసి రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు సాఽధించడం గర్వకారణంగా ఉందన్నారు. నర్తనశాల బృందం సభ్యులు ఉత్తమ జ్యూరీ అవార్డు అర్జునుడు (బృహన్న పాత్రధారణ) చేసిన వై.దక్షిణమూర్తి, సదేష్ణ మహారాణి పాత్ర ధారణి బిక్కి నాగమణి, టీ.కొండలరావు, కీబోర్డు ఉత్తమ ప్రదర్శన వై.సాయితేజ, ప్రతినాయకుడు పాత్ర ఎస్కే అమీర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో పీఎస్‌ రామకృష్ణ, ఆచారి, సత్యనారాయణ, బి.నాగమణి, బాబూరావు, గంగాధర్‌, సాయితేజ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T23:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising