ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘చంద్రబాబు జవాబు చెప్పాలి’

ABN, First Publish Date - 2023-09-04T00:41:06+05:30

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 3: చంద్రబాబుకు ఆదాయ పన్నుశాఖ జారీ చేసిన రూ.118 కోట్ల అవినీతి సొమ్ముపై జవాబు చెప్పాలని, ఇది రాజకీయ ఆరోపణ కాదని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం వైద్యనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 3: చంద్రబాబుకు ఆదాయ పన్నుశాఖ జారీ చేసిన రూ.118 కోట్ల అవినీతి సొమ్ముపై జవాబు చెప్పాలని, ఇది రాజకీయ ఆరోపణ కాదని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం వైద్యనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ నోటీసులపై జాతీయస్థాయి మీడియాలో రాశారని, సాక్షిలో కాదన్నారు. ఐటీశాఖ ఇచ్చిన నోటీసుపై కాకినాడలో జరిగిన మీటింగ్‌లో మీరెందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌, వైసీపీ నాయకులను దుర్మార్గులుగా చిత్రీకరించడంలో చంద్రబాబు అండ్‌ కో అనుకూల మీడియాకు మామూలు అయిపోయిందన్నారు. చంద్రబాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీని ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరన్నారు. సమావేశంలో రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జమ్మలమడక నాగమణి, మాజీ ఎంపీపీ పుల్ల సుధాచందూ, ఏపీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్‌ పుల్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising