అన్నవరం ప్రసాదం స్కీమ్ అమలుకు ఆదేశాలివ్వాలి : ఎంపీ
ABN, First Publish Date - 2023-08-02T23:50:05+05:30
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 2: అన్నవరం ప్రసాదం స్కీమ్ అమలుకు త్వరగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి కిసాన్‌రెడ్డిని కలిసి బుధవారం ఎంపీ వంగాగీత కోరారు. అన్నవరం ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పరిశీలించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 2: అన్నవరం ప్రసాదం స్కీమ్ అమలుకు త్వరగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి కిసాన్‌రెడ్డిని కలిసి బుధవారం ఎంపీ వంగాగీత కోరారు. అన్నవరం ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పరిశీలించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. సెంట్రల్ శాంక్షనింగ్ మోనటరింగ్ కంపె నీ ప్రాజెక్టు ప్రతిపాదనలకు తన ఆమోదాన్ని తెలియజేసినట్టు తెలిపారు. రూ.54.12కోట్లతో తుది డీపీఆర్‌కోసం పలిచా రని, ఇది కేంద్రపర్యాటక మంత్రిత్వశాఖ ప్రభుత్వానికి సమర్పించిదని చెప్పారు. ఆలయంలో నిర్మాణ పనులు ప్రారంభించడానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
కాకినాడ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయాలని తాను కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కోరగా రూ.20కోట్లు కేటాయించారని ఈ మేరకు ఆయనకు ఎంపీ వంగాగీత కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-08-02T23:50:05+05:30 IST