ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివారం కూడా చెత్త సేకరణ జరగాలి

ABN, First Publish Date - 2023-03-02T00:05:51+05:30

ఆదివారం కూడా చెత్త సేకరణ జరగాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన వెంకటేశ్వరకాలనీలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను విభజించి ఇస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆదివారం చెత్తను తీసుకెళ్లేందుకు వాహ

పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ నాగనరసింహారావు

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 1: ఆదివారం కూడా చెత్త సేకరణ జరగాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన వెంకటేశ్వరకాలనీలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను విభజించి ఇస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆదివారం చెత్తను తీసుకెళ్లేందుకు వాహనాలు రావడం లేదని కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయ న స్పందిస్తూ చెత్తను తరలించేందుకు నియమించిన ఏజెన్సీకి ఆదివారం కూడా సొమ్ము చెల్లిస్తున్నామని, తప్పనిసరిగా చెత్త తీసుకెళ్లాల్సి ఉం దని తెలిపారు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చొరవ తీసుకుని నిర్వాహకులతో మాట్లాడాలని, సేవలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీలపై స్లాబులు వేసే సమయంలో లోపల ఉన్న రాళ్లు, ఇతర వ్యర్థాలను తొలగించకపోతే మురికినీటి పారుదలకు అవరోధం కలగుతుందని, ఈ విషయంలో ఇంజనీరింగ్‌, పారిశుధ్య విభాగాలకు చెందిన సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. కమిషనర్‌ వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - 2023-03-02T00:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!