‘మహోన్నత వ్యక్తి సత్యలింగ నాయకర్’
ABN, First Publish Date - 2023-02-04T00:11:34+05:30
మహోన్నత వ్యక్తి, గొప్ప విద్యా దాత సత్యలింగ నాయకర్ అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ 108వ వర్ధంతి సందర్భంగా ఎంఎ్‌సఎన్ ఛారిటీస్ ప్రాంగణంలోని నాయకర్ విగ్రహానికి శుక్రవారం కొండబాబు, చారిటీస్ చైర్మన్ మల్లాడి కార్తీక్ నాయకర్, ఈవో బాబూరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్రైవర్స్ కాలనీ వద్ద గల నాయకర్ విగ్రహాని
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 3: మహోన్నత వ్యక్తి, గొప్ప విద్యా దాత సత్యలింగ నాయకర్ అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ 108వ వర్ధంతి సందర్భంగా ఎంఎ్‌సఎన్ ఛారిటీస్ ప్రాంగణంలోని నాయకర్ విగ్రహానికి శుక్రవారం కొండబాబు, చారిటీస్ చైర్మన్ మల్లాడి కార్తీక్ నాయకర్, ఈవో బాబూరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్రైవర్స్ కాలనీ వద్ద గల నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి చిన్నారులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్‌లు పంపిణీ చేశారు. కళాశాల అఽధ్యాపక సిబ్బంది, వేద పాఠశాల విద్యార్థులు, నాయకులు గుత్తుల రమణ, దండుప్రోలు నాగబాబు, జొన్నాడ వెంకటరమణ, పెమ్మాడి నూకరాజు, గడ్డం పూర్ణ, పంతాడి రాజు, తాడి శ్రీను, రేకాడి లోవరాజు, మల్లాడి రాజు, మేడిశెట్టి ఈశ్వరరావు, మూగు రాజు, పొంగా బుజ్జి, పీర్ల లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
Updated Date - 2023-02-04T00:11:35+05:30 IST