ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొండబాబు ఫ్లెక్సీలు తొలగించడంపై దుమారం

ABN, First Publish Date - 2023-06-26T00:24:07+05:30

కాకినాడ సిటీ, జూన్‌ 25: ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. రెడ్డి అరాచకాలు నశించాలి.. ద్వారంపూడి డౌన్‌ డౌన్‌.. అంటూ టీడీపీ నాయకులు నినాదాలతో హోరెత్తించారు. కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజు సందర్భంగా నగరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు మీద టీడీపీ నాయకుల బైఠాయింపు

కాకినాడ సిటీ, జూన్‌ 25: ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. రెడ్డి అరాచకాలు నశించాలి.. ద్వారంపూడి డౌన్‌ డౌన్‌.. అంటూ టీడీపీ నాయకులు నినాదాలతో హోరెత్తించారు. కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజు సందర్భంగా నగరంలో కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించడంపై దుమారం రేగింది. తొలగించిన బ్యానర్లు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆదివారం స్థానిక టౌన్‌హాల్‌ సెంటర్‌ వద్ద టీడీపీ నాయకులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం కడితే సాయంత్రం తొలగించిన కార్పొ రేషన్‌ అధికారులు అధికార పార్టీ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు నెలలు గడుస్తున్నా తొలగించరని, ప్రతిపక్ష నాయ కుల ఫ్లెక్సీలు ఆఘమేఘాల మీద తొలగిస్తారని ధ్వజమెత్తారు. నిరసనలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్‌, నాయకులు గదుల సాయిబాబు, వొమ్మి బాలాజీ, కొల్లాబత్తుల అప్పారావు, అంబటి చిన్న, సీకోటి అప్పలకొండ, చింతలపూడి రవి, తుమ్మల సునీత, మీసాల సునీత పాల్గొన్నారు. వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలతో పోలీసులు చేరుకుని టీడీపీ నాయకులతో ఫోన్‌లో పోలీస్‌ అధికారులతో మాట్లాడించడంతో నిరసన విరమించారు. అప్పటికే గంటసమయంపాటు మెయిన్‌రోడ్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది.

Updated Date - 2023-06-26T00:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising