ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జేఎన్టీయూకే స్నాతకోత్సవం

ABN, First Publish Date - 2023-05-31T00:01:53+05:30

కాకినాడ జేఎన్టీయూకే 9వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వర్సిటీలోని అలూమ్ని ఆడిటోరియం లాన్‌లో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఎన్టీయూకే, మే 30: కాకినాడ జేఎన్టీయూకే 9వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వర్సిటీలోని అలూమ్ని ఆడిటోరియం లాన్‌లో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. వీసీ సమావేశ హాల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో స్నాతకోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ స్నాతకోత్సవంలో కులపతి, రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ పాల్గొంటారని శాంతా బయోటెక్స్‌ లిమిటెడ్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.ఐ వరప్రసాదరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని స్నాతకోత్సవ ఉపన్యాసం ఇస్తారన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొంటారని చెప్పారు. జేఎన్టీయూకే తరపున గౌరవ డాక్టరేట్‌ను గ్రీన్‌కో గ్రూప్‌ సీఈవో, ఎండీ అనిల్‌ చలమలశెట్టికి ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. పీహెచ్‌డీ అవార్డు గ్రహీతలకు, బీటెక్‌, బీఫార్మసీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మసీ, బీబీఏ, ఎంఎస్‌ ఐటీ, ఫార్మాడి, బీఆర్క్‌ కోర్సుల విద్యార్థులకు ముఖ్య అతిఽథి సమక్షంలో ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు డిగ్రీలు ప్రదానం చేస్తారని పీఆర్వో ప్రొఫెసర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. స్నాతకోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమావేశంలో రెక్టార్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, ఓఎస్‌డీ కోటేశ్వరరావు, పీఆర్వో సీహెచ్‌ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన రిహా ర్సల్స్‌ను మంగళవారం సాయంత్రం వీసీ అధ్యక్షతన వర్సిటీ అధికారులు నిర్వహించారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వీసీ తెలిపారు.

Updated Date - 2023-05-31T00:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising