విద్యతోనే పేదరిక నిర్మూలన
ABN, First Publish Date - 2023-06-01T01:12:57+05:30
పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య కీలకమని గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ అన్నారు. కాకినాడ జేఎన్టీయూకే 9వ స్నాతకోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కులపతి హోదాలో గవర్నర్ అబ్దుల్‌నజీర్ పాల్గొనగా ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ మాజీ ఎండీ డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఇంజనీరింగ్ ప్రపంచంలో నూతన పోకడలను మనం చూడవచ్చన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు సాంకేతికతలో పురోగతిని తెలుసుకోవడం చాలా అవసరమని తెలిపారు. గత పదేళ్లలో పరిశోధనాభివృద్ధిపై స్థూలవ్యయం మూడు రెట్లు పెరిగిందని, రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్‌లో మన దేశం 9వ స్థానంలో ఉందని చెప్పారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్
జేఎన్టీయూకే, మే 31: పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య కీలకమని గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ అన్నారు. కాకినాడ జేఎన్టీయూకే 9వ స్నాతకోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కులపతి హోదాలో గవర్నర్ అబ్దుల్‌నజీర్ పాల్గొనగా ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ మాజీ ఎండీ డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఇంజనీరింగ్ ప్రపంచంలో నూతన పోకడలను మనం చూడవచ్చన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు సాంకేతికతలో పురోగతిని తెలుసుకోవడం చాలా అవసరమని తెలిపారు. గత పదేళ్లలో పరిశోధనాభివృద్ధిపై స్థూలవ్యయం మూడు రెట్లు పెరిగిందని, రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్‌లో మన దేశం 9వ స్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచంలో సాంకేతిక పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉందన్నారు. వర్సిటీ న్యాక్ ఏ+ గ్రేడ్ సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. స్నాతకోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి నాలెడ్జ్ హబ్ అయితే ఏపీ దేశానికి ఎడ్యుకేషన్ హబ్‌గా నిలుస్తుందన్నారు. జాబ్ ఓరియంటెడ్ ఆన్‌లైన్ కోర్సులను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గ్రీన్‌కో గ్రూప్ సీఈవో, ఎండీ చలమలశెట్టి అనిల్‌కు గవర్నర్ నుంచి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అనిల్ భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా సామాజికపరంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో అనుసంధానించిన మౌలిక సదుపాయాలను సృష్టిస్తున్నారన్నారు. ఆయన 2006లో క్లీన్ ఎనర్జీ కంపెనీ అయిన గ్రీన్‌కో గ్రూప్‌ను స్థాపించడం ద్వారా భారతీయ ఇంధన రంగంలో తనదైన ముద్ర వేశారన్నారు. కొవిడ్-19 సమయంలో అత్యవసరంగా ఎయిర్ లిఫ్ట్ చేయడం, చైనానుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు 1000 కంటే ఎక్కువ అధిక సామర్ధ్యం గల ఆక్సిజన్ కాంసెంట్రేటర్లను విరాళంగా అందించారన్నారు. ముఖ్యఅతిథి, స్నాతకోత్సవ ఉపన్యాసకులు వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సమాజపు పోకడలను అర్థం చేసుకుంటూ అనేక అంశాలపై అవగాహన పెంచుకుంటూ నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాన్ని ఆచరణాత్మకంగా ఎలా అన్వయించుకోవాలో వేరే రంగానికి ఎలా మలచుకోవాలి అనే దానిపై అవగాహన పెంచుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. పరిశోధనలు చేసే విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం భారీగా వనరులు సమకూర్చాలని సూచించారు. జేఎన్టీయూకే 160 అనుబంధ కళాశాలలకు మార్గదర్శనం చేస్తూ ప్రతిఏటా 2.5 లక్షలమంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తోందని తెలిపారు. స్నాతకోత్సవంలో భాగంగా 144 పీహెచ్‌డీ అవార్డులు, 66 బంగారు పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత, రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ సుమలత, నన్నయ యూనివర్సిటీ వీసీ పద్మరాజు, డైరెక్టర్లు సీహెచ్ సాయిబాబు, వి.రవీంద్ర, బి.బాలకృష్ణ, ఎ.గోపాలకృష్ణ, మురళీకృష్ణ, వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కన్నబాబు, దొరబాబు, చంద్రశేఖర్‌రెడ్డి, చలమలశెట్టి సునీల్, డి.దొరబాబు పాల్గొన్నారు. సాం స్కృతిక కార్యక్రమాలు అల రించాయి. అయితే స్నాతకోత్సవం సందర్భంగా జేఎన్‌టీయూకే పరి సరాల్లో పోలీసులు అతిగా ప్రవర్తి ంచడంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడ్డారు.
Updated Date - 2023-06-01T01:13:36+05:30 IST