ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి

ABN, First Publish Date - 2023-10-13T00:08:39+05:30

రాష్ట్రంలో 21.76 లక్షలు ఇళ్లు నిర్మాణ లక్ష్యం కాగా... ఇప్పటి వరకు 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.

కాపవరం జగనన్న కాలనీలో ఇళ్లను ప్రారంభిస్తున్న హోం మంత్రి వనిత, కలెక్టర్‌ మాధవీలత, జేసీ భరత్‌

కొవ్వూరు, అక్టోబర్‌ 12 : రాష్ట్రంలో 21.76 లక్షలు ఇళ్లు నిర్మాణ లక్ష్యం కాగా... ఇప్పటి వరకు 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామం జగనన్నకాలనీలో గురువారం నూతన గృహాల ప్రారంభోత్సవాలను చేసి మాట్లా డారు. రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్లపట్టాలను ఉచితంగా పంపిణీ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ లేఅవుట్లలో రూ. 32,909 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 68,519 గృహాల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటివరకు 20 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారన్నారు.గృహ నిర్మాణాలకు రూ. 455.56 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అనపర్తిలో 3108, గోపాలపురంలో 13, గోకవరంలో 194, కొవ్వూరులో 4549, నిడదవోలులో 5556, రాజమహేంద్రవరం అర్బన్‌లో 1100, రాజమహేంద్రవరం రూరల్‌లో 1696, రాజానగరంలో 3596 గృహాలు నిర్మించడం జరిగిందన్నారు.కాపవరం గ్రామం జగనన్న కాలనీలో 209 ఇళ్లకు 69 పూర్తి చేశారన్నారు.

జిల్లాలో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం చివరి బస్తా వరకు ప్రభు త్వం పారదర్శకంగా కొనుగోలు చేస్తుందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.కాపవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేందాన్ని హోంమంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత గురువారం ప్రారంభించి మాట్లా డారు. జిల్లాలో 231 ఆర్‌బీకెల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 4.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.అనంతరం అదే గ్రామంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో జేసీ ఎన్‌.తేజ్‌భరత్‌, హౌసింగ్‌ పీడీ పరశురామ్‌, డ్వామా పీడీ పి.జగదాంబ, ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, డీఎల్‌డీవో వి.శాంతామణి, డీఏవో ఎస్‌.మాధవరావు,పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ ఎ.కుమార్‌, పౌర సరఫరాల జిల్లా అధికారి బి.విజయబాస్కర్‌, ఎంపీపీ కాకర్ల నారాయుడు, సర్పంచ్‌ సుంకర పద్మిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-13T00:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising