ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మెట్టకు సాగునీరు అందించకుంటే పోరాటం

ABN, First Publish Date - 2023-07-18T01:00:47+05:30

తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంత రైతాంగాన్ని సాగునీరు అందించకపోతే పోరాటానికి దిగుతామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు హెచ్చరించారు. గోపాల పురంలోని దొండపూడిలో మినీ మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మన ఇంటికి-మన మద్దిపాటి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు

గోపాలపురం, జూలై 17: తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంత రైతాంగాన్ని సాగునీరు అందించకపోతే పోరాటానికి దిగుతామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు హెచ్చరించారు. గోపాల పురంలోని దొండపూడిలో మినీ మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మన ఇంటికి-మన మద్దిపాటి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుట్టలు అల్లుతున్న మహిళలను, వృద్ధులను అప్యా యంగా పలకరించి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీడు వారిన మెట్ట ప్రాంతాన్ని సాగులోకి తీసుకొచ్చేందుకు నాటి సీఎం చంద్రబాబు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి మెట్ట ప్రాంతాన్ని సాగులోకి తెచ్చారన్నారు. నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ఆ కాల్వ ద్వారా రైతాంగానికి సకాలంలో నీరు అందించలేదని ఆరోపించారు. తాడిపూడి నుంచి చెరుకుమిల్లి వరకు సుమారు 12.8కిలోమీటర్ల మేర 11,732 ఎకరాలు సాగు భూమికి నీరందించాల్సి ఉందన్నారు. అలాగే సబ్‌లిఫ్ట్‌-2 ద్వారా 12 వేల ఎకరాలకు చెందిన వేలాది మంది రైతులకు ఈ ఏడాది జూలై నెలలో సగం గడిచినా నేటికీ తాడిపూడి ద్వారా తాగునీరు అందిచలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గత ఏడాది రబీలో సాగు చేసిన ధాన్యాన్నే కొనలేక రైతుల కష్టాన్ని కొట్టేసిన ముఖ్యమంత్రికి సాగు విలువ తెలియదన్నారు. రైతుకు మేలు చేసేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారాయని మద్దిపాటి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సత్యనారాయణ, ముత్యాల రాయుడు, బండారు గనిరాజు, సోమరాజు, జగదీష్‌కుమార్‌, పిల్లి కృష్ణ, అంకోలు వీరబాబు, సిరపరపు శ్రీనివాస్‌, వెల్లంకి జయశివసూర్యం పాల్గొన్నారు.

Updated Date - 2023-07-18T01:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising