అభ్యర్ధులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటేయాలి
ABN, First Publish Date - 2023-03-03T00:28:23+05:30
సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికే కాకుండా పోటీలో ఉన్న అభ్యర్ధులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటువేసే అవకాశం ఉంటుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొవ్వూరులోని హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
హోం మంత్రి తానేటి వనిత
జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లకు ఎమ్మెల్సీ ఓటింగ్‌పై అవగాహన
కొవ్వూరు, మార్చి 2: సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికే కాకుండా పోటీలో ఉన్న అభ్యర్ధులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటువేసే అవకాశం ఉంటుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొవ్వూరులోని హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఓటింగ్‌లో పాల్గొనే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించారు. హోం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 13న జరగనున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌లకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ను 60 శాతానికి పెంచారన్నారు. శాసన మండలి ఎన్నికల్లో బలహీనవర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైసీపీకి స్పష్టమైన అధిక్యము ఉన్నా విపక్షాలు పోటీకి దిగి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ఎస్.రాజీవ్‌కృష్ణ, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-03T00:28:23+05:30 IST