ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య, పిల్లలను కిడ్నాప్‌ చేశారని భర్త ఫోన్‌

ABN, First Publish Date - 2023-06-11T00:43:38+05:30

పిఠాపురం, జూన్‌ 10: తన భార్య, పిల్లలను కిడ్నాప్‌ చేశారని, వారిని కాపాడాలంటూ 100కి ఒక వ్యక్తి చేసిన కాల్‌ పోలీసులను కంగారు పెట్టించింది. చివరికి అది ఫేక్‌ కాల్‌గా పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... సర్పవరం ప్రాంతంలో నివాసముంటున్న దాసరి రఘుకు, పిఠాపురానికి చెందిన రాజ్యలక్ష్మికి కొం తకాలం క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతా వట్టిదేనని తేల్చిన భార్య

పిఠాపురం, జూన్‌ 10: తన భార్య, పిల్లలను కిడ్నాప్‌ చేశారని, వారిని కాపాడాలంటూ 100కి ఒక వ్యక్తి చేసిన కాల్‌ పోలీసులను కంగారు పెట్టించింది. చివరికి అది ఫేక్‌ కాల్‌గా పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... సర్పవరం ప్రాంతంలో నివాసముంటున్న దాసరి రఘుకు, పిఠాపురానికి చెందిన రాజ్యలక్ష్మికి కొం తకాలం క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి రఘు తన భార్య, పిల్లలను కొందరు వ్యక్తు లు కిడ్నాప్‌ చేసి విశాఖ వైపు కారులో తీసుకువెళ్తున్నారంటూ 100కి కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు కాకినాడ నుంచి విశాఖ మార్గంలో ఉన్న పోలీసుస్టేషన్లను అలెర్ట్‌ చేశారు. వాహన తనిఖీలు చేపట్టారు. పిఠాపు రంలోని మంగాయామ్మరావుపేటలో బాధితురాలి తమ్ముడు, బంధువుల ఇంటికి పిఠాపురం పోలీసులు వెళ్లి విచారించారు. భార్య రాజ్యలక్ష్మి అక్కడే ఉండడంతో ఆమె వద్ద నుంచి వివరాలు తీసుకున్నారు. తనను ఎవ్వరు కిడ్నాప్‌ చేయలేదని స్పష్టం చేసింది. తనను, పిల్లలను భర్త రఘు కొట్టి గాయపరిచారని శుక్రవారం ఉదయం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశానని, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తనకు చికిత్స జరిగినట్లు రాజ్యలక్ష్మి తెలిపింది. రఘుకు సర్పవరం పోలీసులు ఫోన్‌ చేయగా తాను విశాఖలో ఉన్నట్టు తెలిపారని చెప్పింది. తనను చిత్రహింసలకు గురిచేయడమే గాక తనను కాపాడేందుకు వచ్చిన కుటుంబసభ్యులపై కిడ్నాప్‌ చేసినట్టు తప్పుడు ఫిర్యాదు చేసిన రఘుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. దీంతో రఘు చేసిన కిడ్నాప్‌ ఫోన్‌ ఫిర్యాదును ఫేక్‌గా పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. కిడ్నాప్‌ విషయంలో వాస్తవంలేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-06-11T00:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising