గృహ నిర్మాణాలకు రూ.5లక్షలు రుణం అందించాలి
ABN, First Publish Date - 2023-01-18T00:20:02+05:30
జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాల్లో భాగంగా ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షలు చొప్పున గృహ నిర్మాణ రుణం అందించాలన్న ప్రధాన డిమాండుతో ఈనెల17 నుంచి 30వరకు వివిధ దశల్లో సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహిస్తున్నట్టు జిల్లా కార్యదర్శి కొప్పుల సత్తిబాబు తెలిపారు.
అమలాపురం రూరల్, జనవరి 17: జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాల్లో భాగంగా ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షలు చొప్పున గృహ నిర్మాణ రుణం అందించాలన్న ప్రధాన డిమాండుతో ఈనెల17 నుంచి 30వరకు వివిధ దశల్లో సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహిస్తున్నట్టు జిల్లా కార్యదర్శి కొప్పుల సత్తిబాబు తెలిపారు. టిడ్కో గృహాలను తక్షణం లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని, నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాం తాల్లో మూడు సెంట్లు చొప్పున స్థలం చొప్పున కేటాయిం చాలని చేపట్టిన పోరుబాటలో భాగంగా ఈనెల30 వరకు సంతకాల సేకరణ చేపడతామన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల30న వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్‌టేబుల్ సమావేశం, ఫిబ్ర వరి 6న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామ న్నారు. ఫిబ్రవరి 22న విజయవాడలో జరపతలపెట్టిన మహాఽ దర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఈదరపల్లిలోని చింతపల్లి కృష్ణమూర్తి స్మారక స్థూపం వద్ద మహాధర్నా పోస్టర్లను సత్తిబాబు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సీపీఐ, సీఐటీయూ నాయ కులు కురచ నాగేశ్వరరావు, మట్టపర్తి ప్రసాద్, సంపర లక్ష్మణ్, యిళ్ల రామచంద్రరావు, మాచరయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:20:03+05:30 IST